1
00:00:06,924 --> 00:00:09,885
టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

2
00:00:26,402 --> 00:00:28,696
పారిస్, ఫ్రాన్స్

3
00:00:41,709 --> 00:00:42,752
శుభ రాత్రి.

4
00:00:42,835 --> 00:00:44,086
శుభ రాత్రి ఫాదర్.

5
00:02:01,247 --> 00:02:03,165
సిఐఎ ప్రధాన కార్యాలయం
లాంగ్లీ, వర్జీనియా

6
00:02:59,555 --> 00:03:00,514
అబ్బా.

7
00:03:01,181 --> 00:03:03,267
దీంట్లో మంచి ఏమీ లేదు.

8
00:03:03,642 --> 00:03:07,688
విదేశీ వార్తలు స్థానిక పౌరసైన్యం దాడి
చేసిందని ప్రసారం చేస్తున్నాయి.

9
00:03:08,022 --> 00:03:11,150
మన కథనం ప్రకారం,
మనం అక్కడ లేనే లేము.

10
00:03:11,233 --> 00:03:12,359
మన వాళ్ళు ఎంతమంది పోయారు?

11
00:03:12,985 --> 00:03:15,905
ముగ్గురు అమెరికన్లు. ఒక సాగ్.
ఇద్దరు జె.సాక్ లు.

12
00:03:15,988 --> 00:03:19,533
ఈ సమావేశానికి అసలు కారణమైన
విషయం మాట్లాడుకోవచ్చుగా? అతను.

13
00:03:19,825 --> 00:03:20,993
బయోమెట్రిక్స్ ఆధారంగా,

14
00:03:21,076 --> 00:03:23,162
శాస్త్ర మరియు సాంకేతిక డైరెక్టరేట్
ఖచ్చితంగా నిర్ధారించింది,

15
00:03:23,245 --> 00:03:25,789
ఒకప్పుడు మనం అదుపులోకి
తీసుకున్న వ్యక్తి ఇతనే అని.

16
00:03:25,873 --> 00:03:28,250
అతని పోరాట పేరు "సులేమాన్ అల్ బెకా."

17
00:03:28,334 --> 00:03:31,045
ఆ పేరును కనుగొనటానికి
ఇంకా ప్రయత్నిస్తున్నాము.

18
00:03:31,128 --> 00:03:33,297
ఇలాంటి వీడియోలు మరి కొన్నింటిలో
ఇతను కనిపిస్తాడు.

19
00:03:34,048 --> 00:03:36,634
ప్రచారానికి సంబంధించినవి.
అతను మాట్లాడడు,

20
00:03:36,759 --> 00:03:40,512
ఎక్కవగా బయటికి కనిపించని ఇతనికి
సంబంధించిన గుర్తింపు మన దగ్గర లేదు.

21
00:03:40,638 --> 00:03:44,808
చిన్నవాడు, సులేమాన్ అంటే గౌరవం,
సులేమాన్ ఇతన్ని చాలా నమ్ముతాడు.

22
00:03:44,892 --> 00:03:47,478
ఈ సులేమాన్ ఐసిస్ మనిషా?

23
00:03:47,561 --> 00:03:48,562
మా నమ్మకం అదే, సర్.

24
00:03:48,979 --> 00:03:50,105
అతను ఐసిస్ మనిషి కాదు.

25
00:03:55,486 --> 00:03:56,570
నిల్చో.

26
00:04:00,449 --> 00:04:03,786
అంటే అతనందులో చేసి ఉండొచ్చు,
చేసినా కానీ ఇప్పుడు మాత్రం అందులోలేడు.

27
00:04:04,286 --> 00:04:06,205
ఇతను డా. రైన్, మనం సాయంత్రం చూసిన

28
00:04:06,288 --> 00:04:08,832
జిహాద్ వీడియోలో ఉన్నాడు.

29
00:04:09,416 --> 00:04:12,503
బేస్ పైన దాడి జరిగినప్పుడు, అతను,
జిమ్ గ్రీర్ యెమెన్ లో అక్కడే ఉన్నారు.

30
00:04:13,253 --> 00:04:14,964
చెప్పండి డా. రైన్,

31
00:04:15,089 --> 00:04:17,424
మేము ఇతని గురించి
మొదటి సారి వింటున్నాము,

32
00:04:17,508 --> 00:04:19,843
మరి నీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసు?

33
00:04:20,386 --> 00:04:22,221
నేను డబ్బును ఫాలో అవుతున్నాను, సర్.

34
00:04:23,013 --> 00:04:26,100
ఐసిస్ లాంటి సంస్థలు, స్మగ్లింగ్ ద్వారా
లేదా ఇరాన్, సిరియా నుండి

35
00:04:26,183 --> 00:04:28,477
స్వాధీనం చేసుకున్న చమురు
నిల్వల ద్వారా డబ్బు కూడబెడతాయి.

36
00:04:28,560 --> 00:04:30,479
వాళ్ళు ఈ డబ్బును హవాలా
ద్వారా మార్పిడి చేస్తారు.

37
00:04:30,562 --> 00:04:32,314
ఇదంతా అనలాగ్
విధానంలో చేయబడుతుంది, అంటే

38
00:04:32,398 --> 00:04:34,942
డబ్బును నిజంగా ఒక వ్యక్తి నుండి
మరొక వ్యక్తికి అందిస్తారు.

39
00:04:35,025 --> 00:04:38,112
మేము నిలిపివేసిన ఖాతా
ఒక యూరోపియన్ బ్యాంకులోది.

40
00:04:38,195 --> 00:04:41,907
అంటే, నకిలీ ఎల్.ఎల్.సి.ల నుండి అనేక
బదిలీల ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి,

41
00:04:41,991 --> 00:04:43,283
డబ్బు ఎన్నిసార్లు చేతులు మారిందంటే

42
00:04:43,367 --> 00:04:45,160
కేవలం ఒక్క మూలాన్ని
కనుగొనలేము.

43
00:04:45,244 --> 00:04:46,370
అంటే అర్థం ఏంటి?

44
00:04:46,453 --> 00:04:49,498
ఈ వెధవలు వాళ్ళ సొమ్ముని చాలా
సురక్షితంగా పెట్టుకున్నారు.

45
00:04:51,792 --> 00:04:53,210
ఇప్పుడు చూడండి,

46
00:04:53,836 --> 00:04:56,672
ఐసిస్ ఉద్దేశాలలో దృష్టిని
ఆకర్షించటం ఒకటని మనందరికీ తెలుసు.

47
00:04:57,131 --> 00:04:59,466
ఇది వాళ్ళే చేసి ఉంటే,
ఎందుకింకా చేసామని ప్రకటించలేదు?

48
00:05:00,259 --> 00:05:02,094
అది ఋజువు కాదు, జిమ్.

49
00:05:03,470 --> 00:05:06,390
తను నాకు సులేమాన్ గురించి
చెప్పినప్పుడు నేను కూడా అనుమానించాను.

50
00:05:06,807 --> 00:05:08,475
నాకింకే అనుమానాలు లేవు.

51
00:05:08,559 --> 00:05:10,060
నేను ప్రత్యక్షంగా చూసాను,

52
00:05:10,144 --> 00:05:12,604
ఈ క్షేత్రం పై దాడిచేసిన వాళ్ళు
సమన్వయంతోఉన్నారు, సుశిక్షితులు.

53
00:05:12,688 --> 00:05:15,691
వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ లక్ష్యం
ఏమిటో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు.

54
00:05:15,774 --> 00:05:18,694
వాళ్ళ మనుషుల శవాలని కూడా మనం
గుర్తించకుండా తీసుకు వెళ్ళిపోయారు.

55
00:05:21,989 --> 00:05:24,825
స్యూ నేను టాస్క్ ఫోర్స్ ను
నియమిస్తాను.

56
00:05:25,159 --> 00:05:26,368
నీ ఆలోచన ఏంటి?

57
00:05:26,910 --> 00:05:30,122
అతనికి డబ్బులు వస్తున్న మూలాన్ని
చూస్తే, బహుశా...

58
00:05:32,624 --> 00:05:35,335
దీన్ని సిటిసి యూరోప్ కు అప్పగించాలి.

59
00:05:36,503 --> 00:05:38,547
నేట్ మనం ఇతన్ని గుర్తించాము.
దీన్ని టి-ఫాడ్ కి అప్పగించాలి.

60
00:05:38,630 --> 00:05:40,215
టి-ఫాడ్ డబ్బును ఫాలో అవుతుంది.

61
00:05:40,340 --> 00:05:42,760
మీకు ఏ విషయం తెలిసినా,
సిటిసి యూరోప్ కు తెలియజేయాలి.

62
00:05:43,093 --> 00:05:44,803
వాళ్ళకి సహాయం అవసరం.

63
00:05:45,137 --> 00:05:47,306
క్యాంప్ డేవిడ్ నుండి ప్రెసిడెంట్
వెనక్కి వస్తున్నారు.

64
00:05:47,389 --> 00:05:49,391
తెల్లారేసరికల్లా తన ముందుంచడానికి
నాకు ఆప్షన్స్ కావాలి.

65
00:05:49,475 --> 00:05:50,809
అందిస్తాము.

66
00:05:50,893 --> 00:05:53,645
ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా?
సరే. పనులు చూసుకోండి.

67
00:05:59,610 --> 00:06:01,528
ఇప్పుడు ఏం జరిగింది?
నేనేమన్నా తప్పుగా అన్నానా?

68
00:06:01,612 --> 00:06:03,697
దానికి, నీకూ ఏ సంబంధం లేదు.

69
00:06:06,241 --> 00:06:07,159
ఏమయ్యింది?

70
00:06:07,242 --> 00:06:09,369
ఏం లేదు ఈ వెనకాల
వీపు పట్టుకుంది.

71
00:06:09,703 --> 00:06:12,539
ఒక రెండు గంటలు పని మానేసి,
వెళ్ళి డాక్టర్ కు చూపించుకో.

72
00:06:12,623 --> 00:06:13,665
నేను బానే ఉన్నాను.

73
00:06:14,124 --> 00:06:15,125
వెళ్ళి దాన్ని చూపించుకో.

74
00:06:23,217 --> 00:06:27,221
గల్ఫ్ ఆఫ్ ఏడెన్, యెమెన్

75
00:06:44,488 --> 00:06:46,240
నాకిక్కడి మహాసముద్రం వాసన ఇష్టం.

76
00:06:46,323 --> 00:06:48,700
నాకు చేపల వాసనే వస్తుంది.

77
00:06:55,499 --> 00:06:58,836
నన్నే ఎందుకు?
వేరే వాళ్ళని పంపించవచ్చుగా?

78
00:07:00,003 --> 00:07:02,172
నాకు నీ పైనే నమ్మకం ఉంది.

79
00:07:03,090 --> 00:07:07,052
నువ్వు లేకుంటే, నేను సిఐఎ జైల్లో
మగ్గిపోతూ ఉండేవాడిని.

80
00:07:08,929 --> 00:07:10,806
బాగా చేసాను కదా?

81
00:07:11,181 --> 00:07:12,683
నింజా యోధుడిలాగా చేసావు.

82
00:07:14,059 --> 00:07:15,352
సమయం అయ్యింది.

83
00:07:33,745 --> 00:07:35,205
జాగ్రత్తగా ఉండు.

84
00:07:44,506 --> 00:07:45,340
అలీ!

85
00:07:47,426 --> 00:07:48,719
నీతో శాంతి ఉండు గాక!

86
00:07:49,845 --> 00:07:52,514
ఆమె ముందు నీతో ఉంటే మాత్రం వద్దు!

87
00:08:17,080 --> 00:08:19,166
మిమ్మల్ని పరీక్షించడం 20 నిమిషాల్లో
 అయిపోతుంది డా. రైన్.

88
00:08:32,679 --> 00:08:35,265
మీ ఎల్4, ఎల్5 వెన్నుపూసలు కలిపి
ఉండడం కనిపిస్తుంది.

89
00:08:36,433 --> 00:08:40,437
మీ గత సర్జరీలలో కూడా మీరు
చాలా లక్కీగా బయటపడ్డారు.

90
00:08:40,520 --> 00:08:43,482
వెన్నుపూస చుట్టూ ఉన్న గాయపడిన
టిష్యూ కొద్దిగా వాచింది,

91
00:08:43,565 --> 00:08:45,275
కొద్దిగా కటి వాపు కూడా ఉంది.

92
00:08:46,109 --> 00:08:49,404
ఐబుప్రొఫేన్ ఉన్న హైడ్రోకోడోన్
రాసి ఇస్తాను, నొప్పి తగ్గుతుంది.

93
00:08:49,488 --> 00:08:51,323
పర్లేదు, ఏమీ కాదు, మాత్రలు వద్దు.

94
00:08:51,406 --> 00:08:53,075
సరే, ఐస్ పెడితే, వాపు తగ్గుతుంది.

95
00:08:53,158 --> 00:08:56,703
నొప్పి తగ్గిన తరువాత, లోపలి నుండి
కండరాలను బలోపేతం చేయడం మంచిది.

96
00:08:57,120 --> 00:08:58,413
యోగా ప్రయత్నించండి.

97
00:08:58,789 --> 00:09:01,541
-సరే, చేస్తాను.
-నన్నేమైనా అడగాలా?

98
00:09:03,919 --> 00:09:05,420
సంక్రమణ వ్యాధుల శాఖ ఎక్కడుంది?

99
00:09:07,214 --> 00:09:11,426
కుడి ఎడమ మోచేతి సిరల నుండి
ఒకేసారి బ్లడ్ కల్చర్ తీద్దాం.

100
00:09:11,510 --> 00:09:13,595
-తప్పకుండా డా. మ్యుల్లర్.
-ధన్యవాదాలు.

101
00:09:19,685 --> 00:09:21,395
-హే.
-హే.

102
00:09:22,145 --> 00:09:23,480
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?

103
00:09:23,563 --> 00:09:26,149
కింద చూపించుకోవడానికి వచ్చాను,
అప్పుడు...

104
00:09:26,233 --> 00:09:28,735
నువ్వు ఇక్కడ
పని చేస్తున్నావని గుర్తొచ్చింది,

105
00:09:28,819 --> 00:09:30,529
అందుకని కలిసి వెళదామని వచ్చాను

106
00:09:32,197 --> 00:09:33,865
-హాయ్.
-హాయ్.

107
00:09:36,994 --> 00:09:38,245
నువ్వు బాగానే ఉన్నావా?

108
00:09:38,328 --> 00:09:41,373
బాగానే ఉన్నాను.
వీపు కొద్దిగా పట్టేసింది, అంతే.

109
00:09:41,456 --> 00:09:44,668
మీ నాన్న పుట్టిన రోజు పార్టీలో
మాట్లాడే అవకాశం దొరకలేదు.

110
00:09:44,751 --> 00:09:47,879
అవును, అది...
చాలా అద్భుతమైన నిష్క్రమణ.

111
00:09:49,631 --> 00:09:51,383
అంత అత్యవసరం ఏమిటి?

112
00:09:52,718 --> 00:09:53,927
అది

113
00:09:54,511 --> 00:09:58,348
బెతెస్డా రేవులో కలుషిత రొమెయిన్
లెట్యూస్ ఆకుల షిప్మెంట్ ఉండిపోయింది.

114
00:09:58,432 --> 00:10:02,269
ఇ-కోలి ఉందేమో అని భయం.
అందుకే అంత ఉత్కంఠత.

115
00:10:02,352 --> 00:10:05,105
కలుషిత లెట్యూస్ కొరకు కూడా తీర భద్రత
దళాలు మనుషుల్ని తీసుకెళ్తారని తెలీదు.

116
00:10:06,273 --> 00:10:09,359
అంటే వాళ్ళ నినాదం,
 "సెంపెర్ పరాటస్" అని నీకు తెలుసు.

117
00:10:09,651 --> 00:10:11,361
-ఎప్పుడూ--
-సిధ్ధంగా ఉండడం.

118
00:10:11,820 --> 00:10:13,739
-ఆహా.
-వైద్య విద్య. చాలా లాటిన్ పదాలుంటాయి.

119
00:10:14,740 --> 00:10:17,576
నావికా దళం. చాలా నినాదాలుంటాయి.
హే, విను, నేను...

120
00:10:18,744 --> 00:10:20,537
నన్ను క్షమించు. నేను...

121
00:10:22,080 --> 00:10:23,165
క్షమాపణ అంగీకరించాను.

122
00:10:24,624 --> 00:10:25,834
చాలా సులభంగా అంగీకరించావు.

123
00:10:28,462 --> 00:10:30,213
మెరీనా, ఈ బ్లడ్ రిపోర్టులను
ఇవాళ పొద్దున తయారుచేసానని

124
00:10:30,297 --> 00:10:32,382
డా. రుమాక్ కు చెప్తావా?

125
00:10:32,466 --> 00:10:33,717
-తప్పకుండా.
-ధన్యవాదాలు.

126
00:10:33,800 --> 00:10:35,802
ఇప్పుడు నీకేదైనా
కాఫీ బ్రేక్ ఉందా లేక...

127
00:10:35,886 --> 00:10:37,346
నా షిఫ్ట్ ఇప్పుడే మొదలయ్యింది.

128
00:10:39,056 --> 00:10:40,098
డిన్నర్ సంగతేంటి?

129
00:10:40,807 --> 00:10:42,392
లేదా నేను కాల్ చేయనా?

130
00:10:44,144 --> 00:10:45,771
నేను మా నాన్నని నీ గురించి అడిగాను.

131
00:10:47,522 --> 00:10:50,192
తను ఇప్పటివరకు కలిసిన వాళ్ళలో
నువ్వు చాలా తెలివైనవాడివని చెప్పాడు.

132
00:10:50,859 --> 00:10:52,778
కానీ అతి మంచివాడివి అని అన్నాడు.

133
00:10:53,403 --> 00:10:55,739
అది కూడా ఒక విషయమేనా?
దాని అర్థం ఏంటి?

134
00:10:55,822 --> 00:10:58,742
నైతికత, స్వీయ-సత్ప్రవర్తన.

135
00:11:00,118 --> 00:11:01,244
అవి తను అన్న మాటలు.

136
00:11:01,370 --> 00:11:03,080
-అవి తను అన్న మాటలా.
-అవును.

137
00:11:04,414 --> 00:11:06,500
మా నాన్న ఏమనుకుంటాడో
నాకు అనవసరం.

138
00:11:09,544 --> 00:11:11,880
-నీ సెల్ ఇస్తావా?
-ఇదిగో.

139
00:11:15,217 --> 00:11:16,176
తీసుకో.

140
00:11:19,304 --> 00:11:20,305
సరే.

141
00:11:21,431 --> 00:11:22,307
త్వరలో కలుద్దాం.

142
00:11:23,517 --> 00:11:24,434
నాకది తెలుసు.

143
00:11:27,145 --> 00:11:29,606
నువ్వు యోగా చేస్తే బాగుంటుంది.
నీ వీపు కోసం.

144
00:11:30,023 --> 00:11:33,110
అరే, నేను... సరే.

145
00:11:46,498 --> 00:11:48,625
-జాక్?
-హాయ్, చెప్పండి.

146
00:11:49,251 --> 00:11:50,460
నువ్వు ఎక్కడికి వెళ్ళావు?

147
00:11:50,544 --> 00:11:51,753
డాక్టర్ దగ్గరికి.

148
00:11:51,837 --> 00:11:53,004
అంతా బాగానే ఉందా?

149
00:11:53,088 --> 00:11:54,464
బానే ఉంది. వీపు పట్టేసింది అంతే.

150
00:11:54,548 --> 00:11:55,924
యెమెన్ లోనా?

151
00:11:56,383 --> 00:11:57,342
పడవ నడుపుతుంటే.

152
00:11:58,427 --> 00:11:59,761
అయితే అది నిజం కాదా?

153
00:12:00,345 --> 00:12:01,346
ఏది నిజం కాదు?

154
00:12:02,305 --> 00:12:04,391
-నువ్వు గ్రీర్ తో యెమెన్ లో ఉండడం?
-కాదు.

155
00:12:04,474 --> 00:12:07,060
అంటే నువ్వు సెలవు మీద ఉన్నావా?

156
00:12:08,103 --> 00:12:10,939
ఆహా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో,
అర్థమయితే బాగుండేది,

157
00:12:11,022 --> 00:12:12,607
కానీ నాకు చాలా పని ఉంది.

158
00:12:12,691 --> 00:12:15,068
సరే, ఫర్లేదు.
ఎలాగూ మాకూ పని ఉంది.

159
00:12:16,194 --> 00:12:17,320
-జాక్?
-చెప్పు.

160
00:12:17,404 --> 00:12:20,657
పశ్చిమ యెమెన్ ప్రాథమిక లక్ష్యాలు, ఫోన్
నంబర్లతో పాటున్న లింక్ పంపించాను.

161
00:12:20,740 --> 00:12:22,784
అద్భుతం నొరీన్. నీకు ఋణపడ్డాను.

162
00:12:23,410 --> 00:12:26,746
మంచిది. ఎందుకంటే నాకొక సలహా కావాలి.

163
00:12:27,622 --> 00:12:28,582
అతన్ని బయటకి తీసుకెళ్ళమను.

164
00:12:29,541 --> 00:12:30,625
ఎవరిని?

165
00:12:31,042 --> 00:12:33,253
పాడ్ లోని టార్గెటర్,
ఇద్దరూ లిఫ్టులో కలిసి వెళ్ళడానికి

166
00:12:33,336 --> 00:12:34,754
అతను వెళ్ళే సమయానికే
నువ్వూ వెళ్తావుగా.

167
00:12:34,838 --> 00:12:37,340
నిజానికి నేను ఐసెన్ బర్గ్
ఫాంటసీ లీగ్ గురించి మాట్లాడుతున్నాను.

168
00:12:38,884 --> 00:12:40,343
సరే. విషయం ఏమిటి?

169
00:12:40,427 --> 00:12:42,971
సరే. జాక్ గ్రెయింకె
లేక డల్లాస్ కైకెలా?

170
00:12:43,054 --> 00:12:45,265
అరే. గ్రెయింకె ఇ.ఆర్.ఎ.
సగం పాయింట్ తక్కువ ఉంది,

171
00:12:45,765 --> 00:12:49,478
కానీ సన్ ట్రస్ట్ స్టేడియంలో
మినట్ మెయిడ్ స్టేడియం కంటే

172
00:12:49,561 --> 00:12:51,813
మూడు గేమ్ హోమ్ స్టాండ్ కు
1.86 హోమ్ రన్స్ ఎక్కువ వస్తాయి.

173
00:12:52,772 --> 00:12:53,899
అందువల్ల...

174
00:12:54,566 --> 00:12:55,609
కైకెల్.

175
00:12:56,109 --> 00:12:57,027
ధన్యవాదాలు.

176
00:12:57,402 --> 00:12:58,612
సరే.

177
00:13:03,033 --> 00:13:04,326
రైన్ మాన్, నా గదికి రా.

178
00:13:09,414 --> 00:13:10,624
నీ కోసం ఒకటి తీసుకువచ్చాను.

179
00:13:11,458 --> 00:13:12,501
ఏంటిది?

180
00:13:12,918 --> 00:13:14,377
సులేమాన్ సెల్ ఫోన్.

181
00:13:17,547 --> 00:13:20,884
యెమెన్ లో వదిలాడు. సిసిఐ దాన్ని
తెరవడానికి తలలు పగలగొట్టుకుంటున్నారు.

182
00:13:20,967 --> 00:13:21,801
మీరు దొంగిలించారా?

183
00:13:22,302 --> 00:13:23,887
లేదు, అప్పుగా తెచ్చాను.

184
00:13:24,679 --> 00:13:27,933
కొన్నిసార్లు పని పూర్తి చేయడానికి
కొన్ని నియమాలు ఉల్లంఘించవచ్చు.

185
00:13:28,308 --> 00:13:30,936
ఇప్పుడా సెల్ ఫోన్ లో ఒక డిస్క్
నిండా ఎన్ క్రిప్షన్లు ఉన్నాయి

186
00:13:31,019 --> 00:13:32,479
దానికి ఎనిమిది అంకెల పాస్ కోడ్ ఉంది.

187
00:13:32,562 --> 00:13:34,356
బాగుంది. దానర్థం ఏంటో తెలుసా?

188
00:13:34,814 --> 00:13:37,651
అంటే సిసిఐ వాళ్ళకు ఇది తెరవటానికి
10,000 గంటలు పడుతుంది.

189
00:13:37,734 --> 00:13:40,487
అందుకే అక్కడ ఆల్గరిథంలు,
జామెట్రీ చేస్తూ కూర్చున్నారు.

190
00:13:40,987 --> 00:13:42,447
-ఆల్ జీబ్రా.
-ఏంటి?

191
00:13:43,406 --> 00:13:44,658
ఆల్గరిథంలు
ఆల్ జీబ్రా కిందికి వస్తాయి.

192
00:13:44,741 --> 00:13:47,911
ఏదో ఒకటి. ఎవరైనా పాస్ వర్డ్స్
ఊరికే అలా పెట్టుకోరు,

193
00:13:47,994 --> 00:13:49,704
తీవ్రవాద మాస్టర్ మైండ్స్ కూడా.

194
00:13:49,788 --> 00:13:51,248
ఏదో ఒక వ్యక్తిగతమైనది ఎంచుకుంటారు.

195
00:13:51,331 --> 00:13:53,291
పిల్లల పుట్టినరోజు. వాళ్ళ పెళ్ళి రోజు.

196
00:13:54,125 --> 00:13:56,503
ఈ భవనం మొత్తంలో ఆ సులేమాన్ వెధవ
గురించి అందరికంటే నీకే ఎక్కువ తెలుసు.

197
00:13:56,586 --> 00:13:57,921
నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది.

198
00:13:58,338 --> 00:13:59,839
ఎక్కడికి వెళ్తున్నారు?

199
00:13:59,923 --> 00:14:02,259
ఒక చిన్న పని ఉంది.
గంటలో వస్తాను.

200
00:14:28,368 --> 00:14:29,828
సురక్షిత లాగ్ ఔట్.

201
00:14:53,101 --> 00:14:55,437
కాథీ మ్యుల్లర్, ఎం.డి.
ఈ ఏడాది ఎపిడెమాలజిస్ట్ పురస్కారం

202
00:14:58,440 --> 00:15:01,151
మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్న
ఎబోలా వైరస్ లు

203
00:15:03,653 --> 00:15:06,364
"ఈ భయానక వ్యాప్తి ముగింపుకు
వచ్చిందని ఆశిస్తున్నాము."

204
00:15:10,619 --> 00:15:11,536
రైన్.

205
00:15:14,331 --> 00:15:16,916
సరే. వెంటనే వస్తున్నాను.

206
00:15:26,843 --> 00:15:28,470
మీరు వెళ్ళి కలవచ్చు, డా. రైన్.

207
00:15:28,845 --> 00:15:30,847
సరే. అలాగే.

208
00:15:32,891 --> 00:15:33,808
ధన్యవాదాలు.

209
00:15:35,101 --> 00:15:37,145
సరే, మనం దాని గురించి తరువాత
మాట్లాడుకోవచ్చు కదా?

210
00:15:37,896 --> 00:15:39,147
అవును, తప్పకుండా. ఉంటాను.

211
00:15:39,230 --> 00:15:41,816
-జాక్, వచ్చినందుకు ధన్యవాదాలు.
-పర్లేదు.

212
00:15:41,900 --> 00:15:44,361
-నీకేమైనా కావాలా? మంచి నీళ్ళు?
-పర్లేదు.

213
00:15:44,444 --> 00:15:46,613
అయితే నువ్వు నౌకా దళంలో
పని చేసావా?

214
00:15:47,072 --> 00:15:48,114
అవును, సర్.

215
00:15:48,865 --> 00:15:50,700
నిన్ను ఎక్కడికైనా నియమించారా?

216
00:15:50,784 --> 00:15:52,494
-అవును సర్.
-ఇరాకా?

217
00:15:52,952 --> 00:15:54,245
ఆఫ్గనిస్తాన్.

218
00:15:55,038 --> 00:15:57,749
నీ సేవకు ధన్యవాదాలు.

219
00:15:58,917 --> 00:16:00,251
కూర్చోవచ్చుగా?

220
00:16:01,711 --> 00:16:03,421
నువ్వు ఎక్కడ చదువుకున్నావు, జాక్?

221
00:16:03,505 --> 00:16:04,798
బోస్టన్ కాలేజ్.

222
00:16:04,881 --> 00:16:08,635
బోస్టన్ కాలేజా?
నువ్వు డగ్ ఫ్లూటీ అభిమానివా?

223
00:16:08,718 --> 00:16:11,054
అతను నాకంటే కొద్దిగా ముందు
చదువుకున్నాడు, కానీ అవును.

224
00:16:11,137 --> 00:16:12,681
నువ్వు క్రీడలు ఆడుతావా?

225
00:16:12,764 --> 00:16:14,307
-బాస్కెట్ బాల్? ఫుట్ బాల్?
-రోయింగ్ క్రూ.

226
00:16:14,391 --> 00:16:15,642
అరే, అవునా? నేను కూడా.

227
00:16:15,725 --> 00:16:18,436
యేల్ లో. దానికి ముందు గ్రాటన్ లో.

228
00:16:18,520 --> 00:16:20,605
అవును. నీ శరీర తత్వం అలానే ఉంది.

229
00:16:22,148 --> 00:16:24,234
క్షమించండి. నన్ను ఎందుకు
పిలిపించారు సర్?

230
00:16:24,818 --> 00:16:27,028
ఇవాళ పొద్దున సమావేశంలో నువ్వు
చెప్పింది నాకు నచ్చింది,

231
00:16:27,112 --> 00:16:29,072
నువ్వది చెప్పడానికి భయపడలేదు కూడా.

232
00:16:29,656 --> 00:16:33,201
అయితే, అతన్ని ఎలా కనిపెడతావు?
సులేమాన్ ని?

233
00:16:34,619 --> 00:16:37,038
అతని ఆలోచన ఏంటో తెలుసుకునే
ప్రయత్నం చేయాలి.

234
00:16:37,122 --> 00:16:39,541
అతనికి ప్రేరణ కలిగిస్తున్నది
ఏంటో మనం కనుక్కోవాలి.

235
00:16:39,624 --> 00:16:41,918
అతని ప్రేరణ ఏంటా?
వీళ్ళందరికీ ప్రేరణ కలిగించే విషయమే,

236
00:16:42,001 --> 00:16:43,712
పశ్చిమాన్ని అంతం చేసి,
కలీఫా రాజ్యం స్థాపించడం.

237
00:16:43,795 --> 00:16:46,881
అవును. సాధారణంగా అయితే
అంగీకరించేవాడిని, కానీ...

238
00:16:47,716 --> 00:16:48,925
ఇది ఆసక్తిగా ఉంది.

239
00:16:49,008 --> 00:16:51,052
ఇతని కార్యాచరణ ప్రణాళిక
వేరేగా ఉంది.

240
00:16:51,636 --> 00:16:52,637
అంటే?

241
00:16:53,138 --> 00:16:54,389
అతను చేస్తున్న ప్రతి పని,

242
00:16:54,973 --> 00:16:57,559
చాలా నిర్దిష్టంగా, బాగా ఆలోచించి
చేస్తున్నట్టు అనిపిస్తుంది.

243
00:16:57,976 --> 00:17:01,229
అతను డబ్బులు సేకరించిన విధానం చూడండి.
చాలా ఆధునాతనంగా ఉంది.

244
00:17:02,814 --> 00:17:04,190
అతను బిన్ లాడెన్ లాంటి వాడు.

245
00:17:06,484 --> 00:17:10,655
స్పష్టంగా చెప్పాలంటే, నేను దీనిపై
అధికారాన్ని సిటిసి యూరోప్ కి ఇచ్చాను,

246
00:17:10,739 --> 00:17:12,282
కానీ నాకు నీ లాంటి మనుషులు కావాలి.

247
00:17:12,782 --> 00:17:14,993
నువ్వు మంచి చొరవ చూపించావు.

248
00:17:15,076 --> 00:17:17,203
ధన్యవాదాలు సర్.
కానీ పూర్తి గౌరవంతో చెప్తున్నాను,

249
00:17:17,287 --> 00:17:19,956
బ్యాంక్ పై పర్యవేక్షక బృందాన్ని
నియమించింది గ్రీర్.

250
00:17:20,039 --> 00:17:22,417
-అతను లేకుండా--
-నీకొక సలహా ఇవ్వనా, జాక్?

251
00:17:22,500 --> 00:17:25,628
నాకు జిమ్ గ్రీర్ చాలా కాలంగా తెలుసని,
నీకు తెలుసు.

252
00:17:25,712 --> 00:17:28,298
అతను అద్భుతమైన కేస్ అధికారి,

253
00:17:28,381 --> 00:17:32,552
కానీ ప్రధాన కార్యాలయంలో
అతని నైపుణ్యాలు అంతగా పనికిరావు.

254
00:17:33,052 --> 00:17:35,430
ఇక నీ విషయానికి వస్తే,

255
00:17:35,513 --> 00:17:39,225
సులేమాన్ టాస్క్ ఫోర్స్ కి నిన్ను
మన కార్యాలయంలో

256
00:17:39,309 --> 00:17:41,186
సంప్రదింపు వ్యక్తిగా ఉంచదలచుకున్నాను.

257
00:17:41,811 --> 00:17:43,646
సరాసరి నాతో పని చేయవచ్చు.

258
00:17:43,730 --> 00:17:46,649
అంటే, ఇలాంటి ఆపరేషన్
నీ ఉద్యోగ భవిష్యత్తుని పెంచుతుంది.

259
00:17:47,609 --> 00:17:48,651
ధన్యవాదాలు.

260
00:17:50,653 --> 00:17:52,864
ఆలోచించుకుని చెప్పడానికి కొంత
సమయం తీసుకుంటే పర్లేదా?

261
00:17:54,574 --> 00:17:55,575
తప్పకుండా.

262
00:17:57,160 --> 00:18:00,955
కానీ ఎక్కువ కాలం తీసుకోకు, జాక్.
ఈ పని నువ్వు పూర్తి చేస్తే బాగుంటుంది.

263
00:18:02,624 --> 00:18:03,833
ధన్యవాదాలు, సర్.

264
00:18:06,544 --> 00:18:11,800
అల్ మ్నజీర్, సిరియా

265
00:18:19,808 --> 00:18:22,519
సరే, సమీర్ బంగారు, మన పని అయ్యింది.

266
00:18:23,978 --> 00:18:28,191
నువ్విక్కడ ఆడుకుంటే, నీ బొమ్మలను
భోజనాల సమయానికి తీసేయాలి.

267
00:18:28,274 --> 00:18:29,901
నాకు తెలుసు.

268
00:18:29,984 --> 00:18:31,027
నీ గది శుభ్రంగా ఉందా?

269
00:18:31,110 --> 00:18:32,237
శుభ్రంగానే ఉంది.

270
00:18:32,320 --> 00:18:34,239
నిజంగానా బంగారు?

271
00:18:34,322 --> 00:18:36,366
నాన్న ఇంటికి వచ్చాడు!

272
00:18:55,343 --> 00:18:56,761
నాన్నా!

273
00:19:03,434 --> 00:19:04,936
స్వాగతం, నాన్నా.

274
00:19:05,019 --> 00:19:06,646
ధన్యవాదాలు. దేవుడు దయ ఉండుగాక.

275
00:19:12,485 --> 00:19:14,445
మాకేమైనా బహుమతులు తెచ్చావా?

276
00:19:14,779 --> 00:19:17,365
సమయం లేదు తల్లీ.
చాలా పనిలో ఉన్నాను.

277
00:19:21,536 --> 00:19:24,622
కానీ దారిలో, ఇది దొరికింది.

278
00:19:24,706 --> 00:19:25,915
నీకు నచ్చిందా?

279
00:19:29,210 --> 00:19:30,670
ధన్యవాదాలు, నాన్నా!

280
00:19:36,509 --> 00:19:37,886
ఇంకా ఇవి...

281
00:19:38,469 --> 00:19:39,762
మీకు.

282
00:19:39,846 --> 00:19:41,514
ధన్యవాదాలు నాన్నా.

283
00:19:50,565 --> 00:19:52,108
నీకు శాంతి కలుగుగాక.

284
00:19:52,734 --> 00:19:54,527
ఇంటికి తిరిగి స్వాగతం.

285
00:19:55,904 --> 00:19:58,031
నా విలువైన వజ్రమా.

286
00:20:11,085 --> 00:20:12,337
తాజా చేపలు.

287
00:20:12,420 --> 00:20:13,838
అవి అలెక్జాండ్రియా నుంచి తెచ్చినవి.

288
00:20:28,811 --> 00:20:29,771
సారా!

289
00:20:51,376 --> 00:20:53,044
సరే ఎంత కాలం ఇక్కడ ఉంటావు?

290
00:20:55,088 --> 00:20:56,005
తెలియదు.

291
00:20:58,925 --> 00:21:01,135
దావూద్ లేదా మాలిక్ కలిసారా?

292
00:21:01,928 --> 00:21:05,014
దావూద్ మసీదుకి దాదాపు
వస్తూనే ఉంటాడు.

293
00:21:05,098 --> 00:21:06,057
అతన్ని అడిగానని చెప్పండి.

294
00:21:07,558 --> 00:21:08,935
యాస్మిన్ ని చూసావా?

295
00:21:10,186 --> 00:21:11,270
లేదు.

296
00:21:12,480 --> 00:21:15,191
అంటే మేము పిల్లల కొరకు
కోర్టులో ప్రయత్నిస్తున్నాము, కానీ...

297
00:21:16,109 --> 00:21:17,151
లేదు.

298
00:21:18,319 --> 00:21:19,696
వినటానికి బాధగా ఉంది.

299
00:21:21,072 --> 00:21:23,950
నువ్వు కాల్ చేసినందుకు సంతోషం.
నిన్ను కలవడం సంతోషంగా ఉంది, సోదరా.

300
00:21:24,617 --> 00:21:27,912
నువ్వు శుక్రవారాలొచ్చి నమాజు చెయ్యి.
నువ్వు వస్తే అందరూ సంతోషిస్తారు.

301
00:21:31,749 --> 00:21:33,334
నేను ఈ మధ్య నమాజ్ చేయట్లేదు...

302
00:21:35,086 --> 00:21:37,755
అంటే, యాస్మిన్ నేను,
విడిపోయినప్పటి నుండి...

303
00:21:37,839 --> 00:21:39,007
అర్థమయ్యింది.

304
00:21:39,632 --> 00:21:41,175
బహుశా నేను మతం మార్చుకుంది...

305
00:21:43,177 --> 00:21:44,220
ఆమె కొరకే,

306
00:21:45,013 --> 00:21:46,347
ఆమెను పెళ్ళి చేసుకోవచ్చని.

307
00:21:47,807 --> 00:21:48,850
అందువల్ల...

308
00:21:50,393 --> 00:21:52,603
ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉంది...

309
00:21:53,021 --> 00:21:54,313
విషయం అర్థం చేసుకోవడానికి.

310
00:21:56,357 --> 00:21:57,900
నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను.

311
00:21:58,985 --> 00:22:01,487
-అరే, మీరు అలా చేయాల్సిన--
-లేదు. నీ దగ్గర ఉంచుకో.

312
00:22:02,071 --> 00:22:03,489
నీకు గుర్తు ఉండటానికి.

313
00:22:05,575 --> 00:22:11,497
అతని నుండి నువ్వు విడిపోయినా,
అల్లా ఎప్పుడూ నీతోనే ఉంటాడు.

314
00:22:12,165 --> 00:22:14,208
అది ఎప్పుడూ మర్చిపోకు, సోదరా.

315
00:22:55,249 --> 00:22:57,251
ఏం చేస్తున్నావు?

316
00:22:59,420 --> 00:23:00,463
పునః స్వాగతం.

317
00:23:01,214 --> 00:23:02,215
ఎంత వరకు వచ్చింది?

318
00:23:02,298 --> 00:23:05,301
ఒక ఎనిమిది-అంకెల పాస్ కోడ్ ఖచ్చితంగా
ఊహించడం అంటే 10 టు ద పవర్ ఆఫ్

319
00:23:05,384 --> 00:23:08,763
ఎనిమిది అంటే పది కోట్లలో ఒక్క వంతు
పక్కన పెడితే, బాగానే ఉంది

320
00:23:09,305 --> 00:23:12,266
పైగా, 10వ ప్రయత్నం తరువాత,
అది లాక్ అయ్యి, ఎప్పటికీ చెరిగిపోతుంది

321
00:23:12,350 --> 00:23:13,309
మీ సంగతేంటి?

322
00:23:13,684 --> 00:23:14,602
అబ్బా.

323
00:23:17,730 --> 00:23:19,982
అది పెద్ద విషయం.
ప్రయత్నించడంలో తప్పు లేదు.

324
00:23:21,359 --> 00:23:22,443
నేను వెళ్తున్నాను.

325
00:23:23,736 --> 00:23:25,279
ఆగండి, అంతేనా?

326
00:23:26,405 --> 00:23:27,657
నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు?

327
00:23:27,740 --> 00:23:29,408
అంతరాత్మని బట్టి ముందుకెళ్ళాలి,
ఉన్నది అదొక్కటే.

328
00:23:29,492 --> 00:23:31,327
కొన్నిసార్లు అది పని చేయదు,
పని అంటే అంతే.

329
00:23:31,410 --> 00:23:34,163
అవునా, అయితే కరాచీలో మీరు
చేసింది అదేనా?

330
00:23:38,584 --> 00:23:40,294
-ఏం విన్నావు?
-చాలా విన్నాను.

331
00:23:40,378 --> 00:23:42,839
కరాచీలోని అనుబంధ సంస్థలో
ఉన్నప్పుడు ఒకతను మాట్లాడట్లేదని

332
00:23:42,922 --> 00:23:44,882
రెండవ అంతస్థు నుండి తోసేసారట కదా,
అది నాకు ఇష్టమైన విషయం.

333
00:23:44,966 --> 00:23:46,300
తమాషాగా ఉంది.

334
00:23:46,926 --> 00:23:48,845
కరాచీలో కార్యాలయం మొదటి
అంతస్థులో ఉండేది.

335
00:23:50,680 --> 00:23:52,723
మనం కలిసి పని చేయబోతున్నాం,
మిమ్మల్ని వెనక్కి ఎందుకు

336
00:23:52,807 --> 00:23:53,975
పంపించారో తెలుసుకునే హక్కు నాకుంది.

337
00:23:54,058 --> 00:23:56,936
నీకు కరాచీ గురించి చెప్తాను,
నువ్వు ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పు.

338
00:23:58,563 --> 00:23:59,772
నేను అనుకున్నట్టే జరుగుతుంది.

339
00:24:00,523 --> 00:24:02,608
మనం రెండు విషయాల్లో స్పష్టతకు వద్దాం.

340
00:24:02,775 --> 00:24:03,776
ఒకటి,

341
00:24:04,694 --> 00:24:06,904
-నేను నీ స్నేహితుడిని కాను.
-సరే.

342
00:24:06,988 --> 00:24:08,823
మనం కలిసి పని చేయబోతున్నాం,
కానీ నీకు నేను తెలీదు,

343
00:24:08,906 --> 00:24:11,367
నాకు నువ్వు తెలీదు.
నాకు ఈ ఏర్పాటుతో ఏ ఇబ్బంది లేదు.

344
00:24:11,492 --> 00:24:14,328
రెండవది, నీకేమీ చెప్పాల్సిన
అవసరం నాకు లేదు.

345
00:24:14,412 --> 00:24:16,539
నా గతం నా సొంత విషయం,
నీ గతం నీ సొంత విషయం.

346
00:24:16,622 --> 00:24:18,916
కానీ నీ సొంత పనులకు
నన్ను ఉపయోగించుకోవడం పర్లేదా?

347
00:24:19,000 --> 00:24:20,585
-ఆహా, తగ్గు.
-లేదు ఇది వింతగా ఉంది.

348
00:24:20,668 --> 00:24:23,963
-నేను రోజంతా దీని పైన పని--
-ఫుటేజ్ ని వెనక్కి తిప్పు.

349
00:24:30,261 --> 00:24:31,220
ఆపు.

350
00:24:32,680 --> 00:24:35,349
అక్కడ. చూసావా?
సంకెళ్ళు ఎలా వేయించుకున్నాడో చూసావా?

351
00:24:35,850 --> 00:24:40,104
అతనికి సంకెళ్ళు వేయించుకోవడం
కొత్త కాదు. అతను జైల్లో ఉన్నాడు.

352
00:24:40,188 --> 00:24:42,899
అతని పేరు మారు పేర్లను ట్రైడెంట్ లో
గుర్తించడానికి ప్రయత్నించావా?

353
00:24:42,982 --> 00:24:47,612
చూసాను. ఆప్స్ ట్రాఫిక్, డిఓసి ట్రాఫిక్
అతను మన దగ్గర లేనే లేడు.

354
00:24:49,739 --> 00:24:51,032
ఒక్క నిమిషం ఆగు.

355
00:24:52,325 --> 00:24:53,618
మన దగ్గర లేనే లేడు.

356
00:24:56,454 --> 00:24:58,456
ఫోన్ లో సిమ్ కార్డు ఫ్రెంచ్ ది.

357
00:24:59,999 --> 00:25:02,376
డిజిఎస్ఐని అడిగాను. వాళ్ళ దగ్గర
ప్రస్తుత ఫైల్ లేదు.

358
00:25:02,460 --> 00:25:06,088
అతను అసలు వీధిలోకే రాలేదు కాబట్టి,
రాడార్ లో ఎప్పుడూ కనిపించలేదేమో?

359
00:25:06,964 --> 00:25:09,884
ఆఖరి పేరు "సులేమాన్"తో ఫ్రెంచ్
ఖైదీల రికార్డులు చూస్తే

360
00:25:09,967 --> 00:25:13,679
మొదటి పేరు తెలీదు,
మారు పెరు "సులేమాన్ అల్ బెకా."

361
00:25:13,763 --> 00:25:17,141
పుట్టిన స్థలం, బెకా లోయ, లెబానన్.

362
00:25:22,104 --> 00:25:23,439
దేవుడా.

363
00:25:25,524 --> 00:25:27,735
మూసా బిన్ సులేమాన్.

364
00:25:33,366 --> 00:25:35,076
అతని జైలు నంబర్.

365
00:25:35,785 --> 00:25:39,205
ప్రతి పాస్ వర్డ్ దాన్ని సృష్టించే
వ్యక్తి కి వ్యక్తిగతమైనది.

366
00:25:47,171 --> 00:25:49,882
సులేమాన్ ఫోన్ లో కాల్ లాగ్ లో
నాలుగు నంబర్లు ఉన్నాయి.

367
00:25:50,549 --> 00:25:52,260
వాటి ప్రదేశాన్ని కనుక్కున్నాము.

368
00:25:53,010 --> 00:25:54,512
అవన్నీ ప్యారిస్ లో ఉన్నాయి.

369
00:25:55,388 --> 00:25:56,389
ప్యారిసా?

370
00:25:56,806 --> 00:25:58,933
మనం అతని 9.5 మిలియన్లు ఆపేశాము.

371
00:25:59,016 --> 00:26:00,268
అతను వాటిని భర్తీ చేసుకోవాలి.

372
00:26:01,018 --> 00:26:03,104
సింగర్ గారిని నేనే రమ్మన్నాను.

373
00:26:04,522 --> 00:26:06,357
ఆపిన దగ్గర నుండి కొనసాగించు.

374
00:26:07,024 --> 00:26:09,986
సెయింట్-డెనిస్ లోని ఈ నంబరుకు
ఐదు సార్లు కాల్ చేసాడు.

375
00:26:10,444 --> 00:26:13,614
మమ్మల్ని ప్యారిస్ కి పంపించండి,
రాత్రికల్లా అతన్ని పట్టుకువస్తాము.

376
00:26:13,698 --> 00:26:15,992
సిటిసి యూరోప్ ను ఈ విషయంలో
సహాయపడమని అడిగాను.

377
00:26:16,075 --> 00:26:18,577
ముఖ్యమైన విషయాలు వాళ్ళకి
తెలియజేయమని మీ ఇద్దరికీ చెప్పాను.

378
00:26:18,953 --> 00:26:20,079
సరే, నేట్.

379
00:26:24,417 --> 00:26:26,377
డా. రైన్, నువ్వు అతన్ని కనుక్కున్నావు,

380
00:26:27,128 --> 00:26:28,546
ఏం చేయాలని అనుకుంటున్నావు?

381
00:26:33,551 --> 00:26:35,469
నేనూ, గ్రీర్ వెళ్ళాలనుకుంటాను, సార్.

382
00:26:36,178 --> 00:26:39,265
మంచిది, డి.జి.ఎస్.ఐ.తో
అనుసంధానం కండి.

383
00:26:39,348 --> 00:26:41,517
మీరు దిగగానే
వాళ్ళు సహాయం చేసేలా నిర్ధారించుకోండి.

384
00:26:41,600 --> 00:26:43,227
-ధన్యవాదాలు సార్.
-ధన్యవాదాలు సార్.

385
00:26:47,523 --> 00:26:49,233
బెల్ విల్
పారిస్, ఫ్రాన్స్

386
00:27:32,943 --> 00:27:34,487
నిన్న వస్తావనుకున్నాను.

387
00:27:35,196 --> 00:27:36,906
నాకు ఆలస్యమయ్యింది.

388
00:27:45,039 --> 00:27:46,165
అంతా అందులోనే ఉంది.

389
00:28:06,477 --> 00:28:07,603
నీకొక విషయం చెప్పమన్నారు...

390
00:28:07,686 --> 00:28:09,188
ఇదే ఆఖరి సారి.

391
00:28:09,271 --> 00:28:10,356
దీని తరువాత ఇక కుదరదు.

392
00:28:32,503 --> 00:28:33,629
సమీర్!

393
00:28:37,842 --> 00:28:38,884
వెధవ.

394
00:29:10,332 --> 00:29:11,542
ఏం చేస్తున్నావు?

395
00:29:12,835 --> 00:29:14,879
మా నాన్న కొరకు వెతుకుతున్నాను.

396
00:29:16,589 --> 00:29:17,465
క్షమించండి.

397
00:29:18,716 --> 00:29:20,593
హే, ఏంటంత తొందర?

398
00:29:22,261 --> 00:29:23,512
నా పేరు యాజిద్.

399
00:29:24,430 --> 00:29:26,140
నీ పేరు సారా కదా?

400
00:29:31,353 --> 00:29:32,396
రుచి చూస్తావా?

401
00:29:37,776 --> 00:29:39,403
నీ కొరకు కూడా ఒకటి ఉంది.

402
00:29:53,459 --> 00:29:54,627
తెరువు.

403
00:30:12,770 --> 00:30:13,604
సారా!

404
00:30:14,230 --> 00:30:15,481
ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు?

405
00:30:36,085 --> 00:30:37,461
ఏమయ్యింది తల్లీ?

406
00:30:40,381 --> 00:30:42,758
నాకు వాళ్ళంటే అసహ్యం!

407
00:30:42,841 --> 00:30:45,302
నాన్న వాళ్ళని ఇక్కడికి ఎందుకు
తీసుకు వస్తున్నాడు?

408
00:30:45,427 --> 00:30:48,430
ష్ ష్. పర్లేదు తల్లీ.

409
00:30:50,474 --> 00:30:53,394
నిన్ను ఎవ్వరూ ఏమీ చేయకుండా
నేను చూసుకుంటాను.

410
00:31:06,615 --> 00:31:09,285
మొత్తానికి పిల్లలు నిద్రపోతున్నారు.

411
00:31:13,080 --> 00:31:16,000
నీకు ఏ బహుమతి
తీసుకు రాలేదు అనుకుంటున్నావా?

412
00:31:32,224 --> 00:31:35,227
నువ్వు వేసుకుంటే
ఇది చాలా అందంగా ఉంది.

413
00:31:45,613 --> 00:31:48,240
నిన్ను మిస్ అయ్యాను.

414
00:32:03,464 --> 00:32:05,049
ఎందుకు విచారంగా ఉన్నావు?

415
00:32:15,851 --> 00:32:17,770
వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మూసా?

416
00:32:19,480 --> 00:32:21,190
నా పిల్లలు ఇక్కడ పడుకుంటారు.

417
00:32:23,942 --> 00:32:25,986
నువ్వు ఇంటికి
ఎవరిని తీసుకు వస్తున్నావు?

418
00:32:26,987 --> 00:32:30,699
వాళ్ళు మన పిల్లలు. అవునా?

419
00:32:30,783 --> 00:32:34,662
నా జీవితంలో
నేను నిన్ను ఎప్పుడూ ప్రశ్నించలేదు...

420
00:32:35,704 --> 00:32:37,706
ఎందుకంటే నువ్వు మంచి వాడివి.

421
00:32:39,124 --> 00:32:42,878
నువ్వు అస్సాద్ సేనలతో పోరాడినప్పుడు,
నేను అర్థం చేసుకున్నాను

422
00:32:43,337 --> 00:32:48,717
నువ్వు మన కొరకు, మన దేశం కొరకు
పోరాడుతున్నావని అర్థం చేసుకున్నాను.

423
00:32:52,971 --> 00:32:57,851
కానీ ఇపుడు... పరిస్థితులు మారాయి.

424
00:32:59,144 --> 00:33:01,563
ఏమంటున్నావు?

425
00:33:02,815 --> 00:33:05,234
నువ్వు మారావు.

426
00:33:05,609 --> 00:33:08,904
వీళ్ళు నిన్ను ఉపయోగించుకుంటున్నారు.

427
00:33:08,987 --> 00:33:11,073
నన్ను ఉపయోగించుకుంటున్నారా?

428
00:33:11,949 --> 00:33:13,534
వాళ్ళకి నేను అవసరం.

429
00:33:31,301 --> 00:33:37,182
మాకు నువ్వు అవసరం.
నీ కుటుంబానికి. ఇక్కడ.

430
00:33:44,231 --> 00:33:50,154
నేను చేసే ప్రతి పని నీ కొరకు,
మన పిల్లల కొరకు చేస్తాను.

431
00:33:54,241 --> 00:33:56,160
నువ్వు నన్ను నమ్మాలి.

432
00:33:56,910 --> 00:33:58,245
నిన్ను ఎలా నమ్మను?

433
00:33:58,328 --> 00:34:00,622
నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలీదు.

434
00:34:02,624 --> 00:34:04,501
నేను నీ భర్తను.

435
00:34:07,921 --> 00:34:09,757
అందుకే నువ్వు నన్ను నమ్మాలి.

436
00:35:01,892 --> 00:35:05,187
కెప్టెన్ సాండ్రీన్ అర్నాద్.
లెఫ్టనెంట్ టరిక్ లా పాయింట్.

437
00:35:05,270 --> 00:35:06,897
అతను స్వాట్ ఇన్ చార్జి.

438
00:35:06,980 --> 00:35:08,774
జేమ్స్ గ్రీర్. జాక్ రైన్.

439
00:35:10,067 --> 00:35:11,026
గార్త్.

440
00:35:12,945 --> 00:35:16,281
సరే, ముందు ఈ విషయం చెప్పేస్తాను.
ఒక పని అయిపోతుంది.

441
00:35:16,365 --> 00:35:18,325
మీరు ఈ దేశానికి అతిథులు.

442
00:35:18,408 --> 00:35:21,495
నేను ఒక ఆదేశం ఇస్తే,
మీరది పాటించాలని ఆశిస్తాను.

443
00:35:21,578 --> 00:35:24,206
మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే,
ఇప్పుడే చెప్పండి.

444
00:35:25,415 --> 00:35:26,959
లేదు మేడం.

445
00:35:28,418 --> 00:35:30,128
ఫ్రాన్స్ కి స్వాగతం.

446
00:35:30,921 --> 00:35:32,631
మనం దారిలో మాట్లాడుకోవచ్చు.

447
00:35:56,488 --> 00:35:58,490
ఇదిగోవోయ్. వేసుకో.

448
00:36:17,301 --> 00:36:19,803
మీరు మాకిచ్చిన సెల్ నంబర్
ట్రేస్ చేస్తూ ఉన్నాము.

449
00:36:20,178 --> 00:36:22,389
అదే అపార్టుమెంటుకి
ఇంకో ఏడు కాల్స్ వెళ్ళాయి.

450
00:36:22,472 --> 00:36:24,725
పారిస్ కి ఉత్తరాన ఐదు కిలోమీటర్లు.

451
00:36:29,354 --> 00:36:31,231
మీరు చెప్పిన ఈ సులేమాన్
ఫ్రాన్స్ కి చెందినవాడు.

452
00:36:31,315 --> 00:36:33,108
అతను ఇక్కడ ఏమైనా చేయాలని చూస్తున్నాడా?

453
00:36:33,191 --> 00:36:36,820
అతని లక్ష్యం ఏంటో మాకు తెలీదు,
కానీ అతనికి ఎవరో నిధులు ఇస్తున్నారు.

454
00:36:36,904 --> 00:36:38,697
డబ్బు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు.

455
00:36:39,364 --> 00:36:41,366
తరువాత వాటిని తన సెల్ ఫోన్లకి
బదిలీ చేసుకుంటాడు.

456
00:36:41,450 --> 00:36:44,077
ట్రాక్-యూరో అనే యాప్
ఇందుకు ఉపయోగించే అవకాశం ఉంది.

457
00:36:44,161 --> 00:36:45,412
ట్రాక్-యూరో నా?

458
00:36:45,495 --> 00:36:47,581
దీనితో సెల్ ఫోన్ ఉపయోగించి,
సిమ్ కార్డులలోకి

459
00:36:47,664 --> 00:36:51,209
డబ్బును బదిలీ చేయవచ్చు.
పదివేల డాలర్ల ఇంక్రిమెంట్లు.

460
00:36:53,879 --> 00:36:57,341
-గార్త్ కదా?
-అవును, బ్రూక్స్ లాగా.

461
00:36:57,758 --> 00:37:01,178
నేను ప్రతి సారి ఒక కొత్త పేరు
పెట్టుకుంటాను. సరదాగా ఉంటుంది.

462
00:37:01,720 --> 00:37:03,931
హే, ఇదిగో, నీకు గన్ కావాలా?

463
00:37:04,014 --> 00:37:06,350
-నాకు అనుమతి లేదనుకుంటాను--
-ఇది మాగజైన్ విడుదల,

464
00:37:06,475 --> 00:37:08,644
రౌండ్ కొరకు
ఛాంబర్ లోకి తిరిగి పెట్టాలి.

465
00:37:08,727 --> 00:37:10,354
ఇదిగో ఇక్కడ ఉన్నది డికాకర్.

466
00:37:10,479 --> 00:37:12,439
-నేను నిజానికి--
-హే, డాక్టర్, నాకొక సహాయం చేస్తావా?

467
00:37:12,522 --> 00:37:14,399
నువ్వు కాస్త చూసుకుని కాల్చు సరేనా?

468
00:37:14,483 --> 00:37:17,444
నువ్వు బాగా ఉద్రేకపడి,
నన్ను వెనకాల కాల్చకు.

469
00:37:17,527 --> 00:37:19,780
నా పిల్లలు నేను
వ్యోమగామి అనుకుంటున్నారు.

470
00:37:19,863 --> 00:37:22,783
అంతరిక్షంలో వెనకాల బుల్లెట్ తగిలిందని
వివరించడం కొద్దిగా కష్టం.

471
00:37:26,787 --> 00:37:28,413
అవును అలాంటిదే.

472
00:37:37,589 --> 00:37:39,841
సెయిన్-సెయింట్-డెనిస్
పారిస్, ఫ్రాన్స్

473
00:37:59,194 --> 00:38:00,028
ఏంటి విషయం?

474
00:38:01,989 --> 00:38:03,365
ఇంకా ఎంత సేపు పడుతుంది?

475
00:38:03,490 --> 00:38:04,616
దాదాపు అయిపోయింది.

476
00:38:04,700 --> 00:38:06,243
ఇంకో 15, 20 నిమిషాలు.

477
00:38:42,195 --> 00:38:43,363
కొత్త సందేశం
5-0

478
00:38:43,447 --> 00:38:45,157
అయ్యో. నేను మళ్ళీ కాల్ చేస్తాను.

479
00:39:55,560 --> 00:39:56,603
ఇక్కడే ఉండు.

480
00:41:30,322 --> 00:41:32,324
కింద ఒక ఆంబ్యులెన్స్ ఉంది. వెళ్ళండి!

481
00:41:41,458 --> 00:41:42,292
వెళ్దాం పద!

482
00:41:42,375 --> 00:41:44,586
ఎందుకు ఆగావు? కదులు!

483
00:41:51,134 --> 00:41:52,761
పర్వాలేదు. నీకేమీ కాదు.

484
00:41:53,011 --> 00:41:54,304
ఎక్కడికి వెళ్తున్నావు?

485
00:42:35,845 --> 00:42:37,055
నాకు సహాయం చేయండి...

486
00:42:37,138 --> 00:42:38,890
చేతులు చూపించు. మోకాళ్ళ పైన కూర్చో.

487
00:42:40,183 --> 00:42:41,017
దయచేసి!

488
00:42:41,101 --> 00:42:42,227
వద్దు!

