1
00:00:05,506 --> 00:00:08,384
సామ్, రాబ్‌ల నిశ్చితార్థం

2
00:00:08,467 --> 00:00:11,637
నా చిత్రం మసకబారాక

3
00:00:11,721 --> 00:00:15,725
చీకటి తెలవారుతుండగా

4
00:00:15,766 --> 00:00:19,061
నీ కిటికీలో నుంచి చూస్తూ

5
00:00:19,145 --> 00:00:22,857
నేను బాగున్నానని అనుకుంటూ

6
00:00:23,691 --> 00:00:29,447
లోతుల్లో దాగున్న రహస్యాలు దోచి...

7
00:00:31,157 --> 00:00:33,701
మృదంగం మోగింది తప్పుగా

8
00:00:33,784 --> 00:00:37,872
నువ్వు దారితప్పి, నాకోసం చూస్తే
నేను కనిపిస్తాను

9
00:00:38,539 --> 00:00:40,624
మళ్ళీ, మళ్ళీ

10
00:00:41,167 --> 00:00:43,502
-నువ్వు పడిపోతే...
-పట్టుకుంటాను

11
00:00:43,586 --> 00:00:45,838
నేను వేచిఉంటాను

12
00:00:45,921 --> 00:00:47,423
మళ్ళీ మళ్ళీ

13
00:00:48,048 --> 00:00:49,258
తడుతూ ఉన్నాను నా...

14
00:00:49,341 --> 00:00:51,969
నువ్వు దారి తప్పిపోయి, చూస్తే,
నేను కనిపిస్తాను

15
00:00:52,052 --> 00:00:53,137
అందరూ!

16
00:00:53,220 --> 00:00:55,264
మళ్ళీ, మళ్ళీ

17
00:00:56,891 --> 00:00:59,018
మళ్ళీ...

18
00:00:59,810 --> 00:01:02,688
-సరే. అది బాగుందనుకుంటా.
-ధన్యవాదాలు.

19
00:01:02,772 --> 00:01:04,190
ధన్యవాదాలు.

20
00:01:07,568 --> 00:01:09,403
అది బాగుంది, బంగారం.

21
00:01:10,196 --> 00:01:13,699
సరే, వాళ్ళు లాయర్లని, గాయకులు కాదని
స్పష్టంగా తెలుస్తుంది.

22
00:01:15,951 --> 00:01:20,748
సరే, నిజానికి నేను అభినందనల ప్రసంగాల కంటే,
ముగింపు ప్రసంగాలు బాగా ఇస్తాను.

23
00:01:20,831 --> 00:01:23,918
టాం, నువ్వు ఇక్కడికి వచ్చి,
అభినందనల ప్రసంగం ఇస్తావా?

24
00:01:24,001 --> 00:01:26,170
నువ్వు వాళ్ళకు తండ్రి లాంటి వాడివి.

25
00:01:26,253 --> 00:01:29,089
-బాగా చేస్తున్నావు.
-రా, టాం. నిజంగా.

26
00:01:29,173 --> 00:01:30,800
-సరే. అంటే...
-సామీ.

27
00:01:31,300 --> 00:01:34,011
టాం, అయ్యో, దేవుడా, ఇది చూడండి.

28
00:01:35,137 --> 00:01:38,974
రాబ్ ఇప్పుడే ఇది పంపాడు.
దీన్ని ఇంతకు ముందు చూడలేదనుకుంటా.

29
00:01:40,518 --> 00:01:42,144
అవును, ఈరోజు అతని పుట్టినరోజు.

30
00:01:42,228 --> 00:01:47,358
-అవును. అతనికి 71 ఏళ్ళు రావాలి.
-అవును. అయ్యో, దేవుడా.

31
00:01:51,320 --> 00:01:52,238
హే.

32
00:01:53,155 --> 00:01:56,992
సామ్, నాకు ఈరోజు ఒక ఫోన్ వచ్చింది.

33
00:01:58,327 --> 00:02:01,288
సంస్థలో ఒక ప్రజా వేగు ఉన్నాడేమో.

34
00:02:01,372 --> 00:02:02,289
ఏంటి?

35
00:02:02,373 --> 00:02:04,166
దీనితో ఈ కేసు పరిష్కారం కావచ్చు.

36
00:02:06,544 --> 00:02:09,171
జాక్స్ ఫార్మా కేసును
తిరిగి తెరవచ్చు. వెధవలు.

37
00:02:09,255 --> 00:02:12,132
-లేదు, టాం, జాక్స్ ఫార్మాను పరిష్కరించాము.
-అయితే?

38
00:02:12,216 --> 00:02:15,010
జడ్జ్ దానిపై సంతకం చేశారు,
మనం డబ్బు తిరిగి ఇవ్వలేం.

39
00:02:15,094 --> 00:02:19,223
వదిలేయ్. వందల కోట్లలో వ్యవహరిస్తున్నాం.
సంభావ్య దివాళా.

40
00:02:19,306 --> 00:02:20,558
చేయలేము.

41
00:02:22,017 --> 00:02:23,143
నాకు అర్థం కావడం లేదు.

42
00:02:23,227 --> 00:02:26,480
జాక్స్‌పై మన దాడి
ఇప్పుడు ప్రభావం చూపుతుంది.

43
00:02:26,564 --> 00:02:31,652
సామ్, 16 కోట్ల డాలర్లు.
జాక్స్ అది ఏం కష్టపడకుండానే సంపాదిస్తుంది.

44
00:02:31,735 --> 00:02:35,906
టాం, మీరిది వదిలేయాలని
చెబుతున్నాను. ఇప్పుడే.

45
00:02:37,950 --> 00:02:39,493
ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?

46
00:02:42,037 --> 00:02:43,414
ఇది చాలా పెద్ద రిస్క్.

47
00:02:43,497 --> 00:02:47,209
నేను ఇది జ్యూరీ చేతుల్లో పెట్టి,
నష్టపోతుంటే చూస్తూ ఊరుకోలేను.

48
00:02:47,293 --> 00:02:48,419
పరిష్కారం చేసుకున్నాం,

49
00:02:48,502 --> 00:02:51,630
ఇక మనం వేరే విషయాలపై
దృష్టి పెట్టి కొనసాగాలి.

50
00:02:51,714 --> 00:02:52,965
అంతేనా?

51
00:02:53,465 --> 00:02:56,010
అవును. ఎవరో ఒకరు సంస్థను చూసుకోవాలి.

52
00:02:57,386 --> 00:02:58,554
ఇది నా సంస్థ.

53
00:02:58,637 --> 00:03:00,472
మా నాన్న మొదలుపెట్టినది.

54
00:03:00,556 --> 00:03:04,768
మీ నాన్న మొదలుపెట్టిందా. సరే. అయితే?

55
00:03:04,852 --> 00:03:08,230
చూడండి, మీరు జార్జ్ జాక్స్‌పై
ప్రతికారం తీసుకోవాలని తెలుసు.

56
00:03:08,314 --> 00:03:10,858
నాకు అర్థమైంది.
నేనూ అమాండను కోల్పోయాను.

57
00:03:10,941 --> 00:03:12,026
వద్దు.

58
00:03:13,485 --> 00:03:14,612
నన్ను క్షమించండి.

59
00:03:15,988 --> 00:03:17,489
నీకు ఏమయింది?

60
00:03:21,243 --> 00:03:22,828
నిన్ను ఎవరైనా ప్రభావితం చేశారా?

61
00:03:33,881 --> 00:03:35,591
నువ్వు వాళ్ళకు ఏం మాట ఇచ్చావు?

62
00:03:42,765 --> 00:03:43,933
హే...

63
00:03:51,315 --> 00:03:53,651
మీకు కొంచెం సమయం కావాలనుకుంటా.

64
00:03:55,110 --> 00:03:57,321
మీరు ఇక్కడ మీ దృక్పథాన్ని కోల్పోయారు.

65
00:03:59,490 --> 00:04:00,616
నేను అర్థం చేసుకోగలను.

66
00:04:00,699 --> 00:04:03,535
అంటే, మీ భార్యా, మీ కూతురు...
నాకు అర్థమైంది.

67
00:04:03,619 --> 00:04:04,745
సరే.

68
00:04:08,290 --> 00:04:10,125
మీ నాన్న ఇక్కడ ఉంటే బాగుండేది.

69
00:04:33,190 --> 00:04:35,401
గొలాయత్

70
00:04:36,443 --> 00:04:40,072
ఇరువైపుల వారు నిజమే చెబుతామని
ప్రమాణం చేసేందుకు సిద్ధమయితే,

71
00:04:40,155 --> 00:04:42,241
మనం మొదటి సభ్యమండలిని పిలుద్దాం.

72
00:04:49,123 --> 00:04:51,417
మేము తల్లిదండ్రులు, వయో వృద్ధులు,

73
00:04:51,500 --> 00:04:54,336
వైద్య చరిత్ర కలిగినవారు,
మాజీ సైనికులకై చూస్తున్నాం.

74
00:04:54,420 --> 00:04:58,132
ప్రశ్నావళి ఆధారంగా,
మనం మూడు, నాలుగు, ఏడు

75
00:04:58,215 --> 00:05:00,551
పది, పదకొండు సభ్యులతో వాదన చేయాలి.

76
00:05:01,969 --> 00:05:03,470
అది బాగానే ఉంది.

77
00:05:04,430 --> 00:05:08,350
యువర్ ఆనర్, అలాగే మేము
జ్యూరీని అంగీకరిస్తున్నాము.

78
00:05:09,059 --> 00:05:12,438
-ఆగండి. ఆయన ఏం చేస్తున్నారు?
-చిచ్చు పెడుతున్నారు.

79
00:05:12,521 --> 00:05:15,065
మి. మెక్‌బ్రైడ్, ఖచ్చితంగా అంటున్నారా?

80
00:05:15,899 --> 00:05:17,609
అవును, యువర్ ఆనర్. ఖచ్చితంగానే.

81
00:05:18,652 --> 00:05:22,448
యువర్ ఆనర్, ఇక్కడ అభియోగి
ఆట ఏమిటో అర్థం కావడం లేదు,

82
00:05:22,531 --> 00:05:24,992
అయినా కానీ మేము సభ్యులను పరిశీలించాలి.

83
00:05:25,075 --> 00:05:26,660
ఒక్కొక్కరిని ఎంచుకోవచ్చు.

84
00:05:26,744 --> 00:05:29,538
-మీరు వారిలో ఎవరినీ సవాలు చేయరా?
-లేదు.

85
00:05:29,621 --> 00:05:31,790
-అయినా, ఒక్క విషయం ఉంది.
-అదేంటి?

86
00:05:33,542 --> 00:05:36,962
మేము మా సాక్షుల జాబితాను సవరించాలి,
గ్రెగ్ వెట్జెల్‌ను జతపరచాలి.

87
00:05:38,547 --> 00:05:40,716
గౌరవనీయులు ఎం.సీ, రీస్

88
00:05:41,884 --> 00:05:43,093
వెట్జెల్‌ను జత చేయకూడదు.

89
00:05:43,177 --> 00:05:45,888
వద్దు, నేను ఒక చిన్న విరామం అడుగుతాను.

90
00:05:46,555 --> 00:05:50,267
యువర్ ఆనర్, నేను ఒక్క నిమిషం
మి. మెక్‌బ్రైడ్‌తో మాట్లాడవచ్చా?

91
00:05:52,352 --> 00:05:55,481
మనం త్వరగా భోజన విరామం తీసుకుందాం.
తిరిగి 1:00కు.

92
00:05:56,940 --> 00:05:58,025
అందరూ నిలబడండి.

93
00:06:07,743 --> 00:06:08,827
బిల్లి...

94
00:06:09,787 --> 00:06:11,747
ఏం జరుగుతోంది?

95
00:06:11,830 --> 00:06:15,417
-మీకు పెద్ద పరిష్కారం కావాలి.
-మనం విషయాలు ఇలా వ్యవహరించము.

96
00:06:15,501 --> 00:06:17,169
ఖచ్చితంగా కాదు. ధన్యవాదాలు.

97
00:06:20,964 --> 00:06:24,384
మంచి వార్త.
ఐవన్ టిల్లింజర్ మీ షరతులను అంగీకరించారు.

98
00:06:24,468 --> 00:06:26,762
మనం 16 కోట్లకు పరిష్కరించుకుందాం.

99
00:06:26,845 --> 00:06:30,599
అది నిన్నటి ధర,
ఈ రోజు ఎంత ఇస్తారు?

100
00:06:30,682 --> 00:06:34,144
-16 కోట్లు.
-లేదు, ఆ అవకాశం చేజార్చుకున్నారు.

101
00:06:34,228 --> 00:06:36,438
విచారణ ప్రారంభమయింది,
జ్యూరీ ఎంచుకోబడింది.

102
00:06:36,522 --> 00:06:38,107
గ్రెగ్‌ను ఎక్కడ కలిశారు?

103
00:06:38,190 --> 00:06:40,984
ఫిషర్‌మ్యాన్స్ వార్ఫ్, బ్రెడ్ బౌల్‌లో,
అది ముఖ్యమా?

104
00:06:41,068 --> 00:06:46,406
అతని సాక్ష్యం హేయమైనది. ప్రతి న్యాయమూర్తి
టిల్లింజర్ దోషి అని గుర్తిస్తారు.

105
00:06:48,158 --> 00:06:49,451
మీకు ఎంత కావాలి?

106
00:06:49,535 --> 00:06:50,911
వంద కోట్లు.

107
00:06:55,082 --> 00:06:56,125
సరే, అలాగే.

108
00:06:59,878 --> 00:07:01,338
నేను సగం ఇప్పిస్తాను.

109
00:07:01,421 --> 00:07:02,756
సరే, నాకు వద్దు.

110
00:07:03,465 --> 00:07:05,217
నేను 60 కోట్లు ఇప్పిస్తాను.

111
00:07:07,344 --> 00:07:11,974
యువర్ ఆనర్, టిల్లింజర్ హెల్త్, రాష్ట్రంతో
ఒక తాత్కాలిక పరిష్కారం చేసుకుంది.

112
00:07:12,057 --> 00:07:14,893
మి. మెక్‌బ్రైడ్, నేను
నా క్లయింట్‌పై అన్ని ఆరోపణలు

113
00:07:14,977 --> 00:07:17,271
కొట్టివేయాలని ఉమ్మడి అభర్థన చేస్తాము.

114
00:07:17,354 --> 00:07:20,524
-మి. మెక్‌బ్రైడ్, ఏమైనా అభ్యంతరాలున్నాయా?
-లేవు, యువర్ ఆనర్.

115
00:07:20,607 --> 00:07:24,319
ఒప్పందంలోని అన్ని షరతులకు
విశ్వసనీయత ఉంటేనే.

116
00:07:24,403 --> 00:07:25,946
మరి రస్సెల్ డ్రగ్?

117
00:07:26,029 --> 00:07:28,490
వాళ్ళు చర్చలపై ఆసక్తి కనబరచడం లేదు.

118
00:07:28,574 --> 00:07:34,204
మి. పెటాక్, కేవలం ఒక్క ప్రతివాది మాత్రమే
మిగిలారు. ఇదే సమయం.

119
00:07:34,830 --> 00:07:38,208
వాళ్ళు కోర్టులో అవకాశం కోసం చూస్తున్నారు,
యువర్ ఆనర్.

120
00:07:38,292 --> 00:07:40,377
సూచించిన నాడే విచారణ కొనసాగుతుంది.

121
00:07:40,460 --> 00:07:43,255
సోమవారం న్యాయవాది
ప్రాథమిక ప్రకటనతో మొదలుపెడతాం.

122
00:07:43,338 --> 00:07:44,423
కోర్టు వాయిదా పడింది.

123
00:07:49,136 --> 00:07:54,474
అందరూ, మనం ఈరోజు జరిగినది గుర్తించేందుకు
ఒక్క నిమిషం సమయం తీసుకుందాం.

124
00:07:54,558 --> 00:07:56,226
ఇది అద్భుతం, ముఖ్యమైన రోజు...

125
00:07:56,310 --> 00:07:58,061
60 కోట్లు.

126
00:07:58,604 --> 00:08:01,815
జ్యూరీ ఎంపికలో
మీ భిన్నమైన వైఖరిని పక్కనపెడితే,

127
00:08:01,899 --> 00:08:04,484
మి. మెక్‌బ్రైడ్, బాగా చేశారు, అభినందనలు.

128
00:08:04,568 --> 00:08:07,237
-సరే, ధన్యవాదాలు.
-లేదు. నిజంగా బాగా చేశారు.

129
00:08:07,321 --> 00:08:09,489
మా నాన్న చాలా గర్వపడతారు.

130
00:08:16,705 --> 00:08:17,706
హే.

131
00:08:17,789 --> 00:08:19,291
-హే.
-ఏంటి సంగతులు?

132
00:08:19,374 --> 00:08:22,252
నేను ఇక వెళతాను.
నాకు అంత బాగా అనిపించడం లేదు.

133
00:08:22,336 --> 00:08:25,339
-క్యాబ్ పిలవనా?
-వద్దు. అది కొనసాగడంలో సాయపడుతుంది.

134
00:08:25,422 --> 00:08:27,216
-అందుకని, వెళతాను...
-ఖచ్చితంగానా?

135
00:08:27,299 --> 00:08:29,092
-అవును, నాకు పరవాలేదు.
-సరే.

136
00:08:29,176 --> 00:08:30,719
హే, విను, మరో విషయం.

137
00:08:30,802 --> 00:08:34,389
టిల్లింజర్ అంత సులభంగా
ఒప్పుకుంటాడని అనుకున్నావా?

138
00:08:35,515 --> 00:08:38,852
నువ్వు జ్యూరీపైన కత్తి పెట్టావు,
వాళ్ళకు మరో దారి లేదు.

139
00:08:41,772 --> 00:08:44,441
-పార్టీ ఆనందించు. తరువాత మాట్లాడతాను.
-సరే.

140
00:09:02,584 --> 00:09:06,797
నాతో కలిసి పార్టీ జరుపుకోడానికి
మిమ్మల్ని ఒప్పించగలనంటారా?

141
00:09:06,880 --> 00:09:09,258
లేదు, నాకు పార్టీలు నచ్చవు. క్షమించు.

142
00:09:09,341 --> 00:09:10,592
అర్థం చేసుకోగలను.

143
00:09:11,551 --> 00:09:13,512
రేపు రాత్రి డిన్నర్‌కి ఏమంటారు?

144
00:09:14,054 --> 00:09:15,806
సరే. నేను వస్తాను.

145
00:09:15,889 --> 00:09:17,683
మంచిది. మీకు సందేశం పంపుతాను.

146
00:09:17,766 --> 00:09:19,559
సరే. అలాగే. శుభరాత్రి.

147
00:09:25,148 --> 00:09:26,483
నువ్వు మీ నాన్నలాగానే.

148
00:09:26,566 --> 00:09:29,653
సమస్యలో విజయం సాధించాక
ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయేవారు.

149
00:09:29,736 --> 00:09:31,363
నిజానికి, చాలా చిరాకు.

150
00:09:31,947 --> 00:09:33,198
నీకు ఎలా తెలుసు?

151
00:09:33,282 --> 00:09:34,491
ఏంటి?

152
00:09:35,284 --> 00:09:37,911
నువ్వు "యాభై కోట్లకు పైన" అని
హామీ ఇచ్చావు.

153
00:09:37,995 --> 00:09:39,538
నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు.

154
00:09:39,621 --> 00:09:42,374
జాక్స్ ఫార్మాతో 16 కోట్లకే
పరిష్కారం అయ్యింది.

155
00:09:43,000 --> 00:09:46,086
నాకు నా ఆత్మవిశ్వాసమే లేదంటే
నాకు ఏమీ లేనట్టే.

156
00:09:47,296 --> 00:09:49,423
నువ్వు అలా అని ఎంబ్రాయిడరీ కుట్టించుకో.

157
00:09:58,015 --> 00:10:01,560
అయితే, ఇప్పుడు నేను
రస్సెల్ డ్రగ్ గురించి ఆలోచిస్తున్నాను.

158
00:10:01,643 --> 00:10:04,021
మెక్‌బ్రైడ్ అదే ఎత్తు రెండుసార్లు వాడలేరు.

159
00:10:04,104 --> 00:10:06,440
అతను మనల్ని రక్షిస్తున్నాడు, ఏవా.

160
00:10:07,065 --> 00:10:10,277
నువ్వెప్పుడూ ఈ విషయంలో
గెలవడానికి ఏమీ చేయలేదు,

161
00:10:10,360 --> 00:10:13,447
ఇలా విసిగించడం ఏదో ఘనకార్యం అనుకోవడం తప్ప.

162
00:10:13,530 --> 00:10:15,782
ఇక్కడ మన పాత్రల గురించి స్పషంగా ఉందాం.

163
00:10:16,450 --> 00:10:20,537
మీ నాన్న నన్ను ఆర్థిక వ్యవహారాలను,
నీ నడవడికను చూసుకోమన్నారు.

164
00:10:20,620 --> 00:10:22,164
ఇందులోకి ఆయనను లాగకు.

165
00:10:22,247 --> 00:10:24,041
నీకు క్రమశిక్షణ లేదని భావించారు.

166
00:10:24,124 --> 00:10:25,876
నీకు ముందుచూపు లేదని అనుకున్నారు.

167
00:10:27,419 --> 00:10:31,214
ఇక, ఆయనలాగా కాకుండా,
నేను నా రాత్రిని ఆనందిస్తాను. తప్పుకో.

168
00:11:04,915 --> 00:11:05,874
హాయ్!

169
00:11:06,708 --> 00:11:07,709
హాయ్.

170
00:11:09,544 --> 00:11:10,754
మీరు బాగానే ఉన్నారా?

171
00:11:11,880 --> 00:11:15,384
బాగానే ఉన్నాను. హే, అయినా, నువ్వు ఎవరు?

172
00:11:16,093 --> 00:11:17,677
నీ పేరేంటి?

173
00:11:42,119 --> 00:11:46,498
నాన్నా, ఏం చేస్తున్నారు?
మీరు మాట ఇచ్చారు.

174
00:11:47,416 --> 00:11:48,625
ఏం మాట?

175
00:11:49,960 --> 00:11:52,712
నేను మాత్రమే మీతో వ్యవహరిస్తానని.

176
00:11:53,839 --> 00:11:57,592
మీరు అందరినీ వెళ్ళిపొమ్మంటే,
ఏం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు.

177
00:11:59,845 --> 00:12:01,972
నిన్ను నువ్వు చంపుకుంటావా?

178
00:12:04,558 --> 00:12:07,602
ఏమో. అయితే ఏంటి?

179
00:12:11,398 --> 00:12:12,566
ఎక్కు.

180
00:12:36,173 --> 00:12:37,674
కాస్త నెమ్మదిగా వెళతావా?

181
00:12:38,550 --> 00:12:41,094
మీరు రైలు అందుకోవాలని అన్నారు.

182
00:12:41,178 --> 00:12:43,180
కానీ అక్కడికి సజీవంగా వెళ్ళాలని ఉంది.

183
00:13:16,463 --> 00:13:17,714
"ఆగ్రహం."

184
00:13:19,424 --> 00:13:20,884
ఆగ్రహం దేనికి?

185
00:13:22,802 --> 00:13:24,846
"అసూయ"కు మరో పదం.

186
00:13:26,806 --> 00:13:28,099
అది 22 నిలువు.

187
00:13:31,394 --> 00:13:33,647
పజిల్స్/సలహా
దిన పదప్రహేళిక

188
00:13:34,397 --> 00:13:35,732
డెనిస్ ఎక్కడ?

189
00:13:37,859 --> 00:13:40,362
అక్కడ ఉన్నది తను కాదు, కదా?

190
00:14:47,178 --> 00:14:48,305
హలో?

191
00:15:05,947 --> 00:15:06,948
బ్రిటనీ?

192
00:15:07,032 --> 00:15:08,074
బిల్లి?

193
00:15:09,409 --> 00:15:11,870
అవును. క్షమించు.
నా స్నేహితుడు ఫోన్ ఎత్తాడు.

194
00:15:13,330 --> 00:15:15,165
సరే, విను.

195
00:15:18,001 --> 00:15:20,503
డెనిస్ బ్రతికే ఉందేమో తెలుసుకుందామని.

196
00:15:21,087 --> 00:15:24,132
దేవుడా, బిల్లి, ఏం జరుగుతోంది?

197
00:15:24,215 --> 00:15:25,467
తను బ్రతికే ఉందా?

198
00:15:26,009 --> 00:15:27,802
అవును, బ్రతికే ఉంది.

199
00:15:29,512 --> 00:15:31,473
నేను తెలుసుకోవాలి, సరేనా?

200
00:15:32,349 --> 00:15:33,600
నువ్వు తనకు కాల్ చేయాలి.

201
00:15:33,933 --> 00:15:35,352
అవును, నాకు అది తెలుసు.

202
00:15:36,478 --> 00:15:40,106
నాకు తెలుసు. చూడు, కాదు నేను...

203
00:15:41,733 --> 00:15:42,651
నీకు తెలుసు...

204
00:15:43,485 --> 00:15:46,321
నువ్వు ఎవరితోనైనా ఉన్నా,
బయట ఉన్నా, ఏదైనా సరే.

205
00:15:46,404 --> 00:15:49,199
-నీకు తరువాత కాల్ చేస్తాను.
-వద్దు, బిల్లి, అది...

206
00:16:01,294 --> 00:16:05,840
నాన్న

207
00:16:29,114 --> 00:16:33,493
నువ్వు ఎప్పుడైనా 7:50 సంఖ్యలో చూస్తే
7:50లా ఉంటుంది, అదే గడియారంలో చూస్తే,

208
00:16:33,576 --> 00:16:36,663
అది పదినిమిషాలు తక్కువ 8:00లా
ఉంటుంది, అది గమనించావా?

209
00:16:37,997 --> 00:16:39,374
ఎప్పుడూ అది ఆలోచించలేదు.

210
00:16:40,875 --> 00:16:42,293
అయితే అది నిజమే, కదా?

211
00:16:45,213 --> 00:16:46,297
అవును.

212
00:16:52,721 --> 00:16:53,888
అది నేనే!

213
00:16:59,728 --> 00:17:01,312
నువ్వు ఎప్పుడు చెప్పలేదు...

214
00:17:02,230 --> 00:17:04,274
నువ్వు ఉన్నతంగా కనిపించే లాయర్ అని.

215
00:17:06,526 --> 00:17:07,777
అంటే, నేను నిజంగా కాను.

216
00:17:08,361 --> 00:17:10,113
టీవీ ప్రకారం, అవును.

217
00:17:11,406 --> 00:17:12,949
అవును, నీకు తెలుసుగా టీవీ.

218
00:17:15,452 --> 00:17:17,412
అది ఆమోదించబడిన విషయం, కదా?

219
00:17:18,288 --> 00:17:19,873
ఎల్లప్పుడూ అవును, ఫ్రాంక్.

220
00:17:22,876 --> 00:17:24,711
నాకు నీ పేరు ఫ్రాంక్ అని తెలుసు.

221
00:17:27,464 --> 00:17:29,340
దాని వలన ఏమైనా మార్పు ఉందా?

222
00:17:30,675 --> 00:17:32,051
ఏమీ లేదనుకుంటా.

223
00:17:36,890 --> 00:17:38,558
నీకు పీడకలలు వస్తాయా?

224
00:17:40,769 --> 00:17:42,395
అవును, అలాంటివే.

225
00:17:45,982 --> 00:17:48,276
నువ్వు నీ పిచ్చి ఊగే కుర్చీలో కాకుండా

226
00:17:48,359 --> 00:17:51,488
నీ మంచం మీద పడుకోవాలనుకుంటా.

227
00:17:51,571 --> 00:17:53,239
నువ్వు నన్ను గమనిస్తున్నావు.

228
00:17:55,283 --> 00:17:57,118
నేను అందరినీ గమనిస్తుంటాను.

229
00:17:59,245 --> 00:18:00,830
నువ్వేమీ ప్రత్యేకం కాదు.

230
00:18:02,749 --> 00:18:03,958
నీకు భార్య ఉందా?

231
00:18:06,002 --> 00:18:07,045
పిల్లలు?

232
00:18:10,632 --> 00:18:12,884
నాకు మాజీ భార్య, ఒక కూతురు ఉన్నారు.

233
00:18:13,676 --> 00:18:15,553
సరే, నాకూ ఒక కూతురు ఉంది.

234
00:18:16,846 --> 00:18:20,558
నన్ను ద్వేషిస్తుంది.
అది ఖచ్చితంగా నా తప్పే.

235
00:18:22,435 --> 00:18:24,437
అంటే, నీకు బాగా అనిసిస్తుందంటే,

236
00:18:24,521 --> 00:18:27,065
నా కూతురు కూడా నన్ను ద్వేషిస్తుంది.

237
00:18:28,107 --> 00:18:30,527
అంటే, అది నాకు ఎందుకు బాగా అనిపించాలి?

238
00:18:32,695 --> 00:18:36,115
అంటే, నువ్వు ఒంటరివి కాదు.
అదే నేను చెబుతున్నది.

239
00:18:36,908 --> 00:18:39,953
నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. ఆమెకు కూడా అంతే.

240
00:18:40,620 --> 00:18:42,914
అదే సమస్య అనుకుంటా.

241
00:18:47,335 --> 00:18:48,795
నువ్వు ఏం చేస్తుంటావు?

242
00:18:48,878 --> 00:18:50,129
అంటే ఏంటి?

243
00:18:51,965 --> 00:18:53,091
నీ కూతురు కోసం?

244
00:18:55,385 --> 00:19:01,182
అంటే, నన్ను కాల్చాక నేను తన దగ్గర ఉండడం
నాకు అనువుగా లేదు.

245
00:19:02,725 --> 00:19:04,102
అయితే నువ్వు వెధవ్వా?

246
00:19:04,185 --> 00:19:05,603
చాలా మటుకు, అవును.

247
00:19:06,271 --> 00:19:08,273
అయితే నువ్వది కొనితెచ్చుకున్నావు.

248
00:19:08,356 --> 00:19:10,441
నేను చాలా బాధలో ఉన్నాను, ఇప్పుడు కూడా.

249
00:19:10,525 --> 00:19:12,777
ఇప్పుడు నువ్వు
తను చెడ్డదని అంటున్నావా?

250
00:19:12,861 --> 00:19:14,028
లేదు, తను మంచిది.

251
00:19:15,488 --> 00:19:20,535
అంటే, మీలో ఒకరు చెత్తవాళ్ళు.
ఎవరో ఎంచుకోవాలి.

252
00:19:22,203 --> 00:19:23,413
నీ సంగతి ఏంటి?

253
00:19:24,831 --> 00:19:26,207
నా సంగతి ఏంటా?

254
00:19:28,626 --> 00:19:29,961
నువ్వు వెధవ్వా?

255
00:19:33,214 --> 00:19:39,012
మా అన్న మనం ఎప్పుడూ చూడనంత పెద్ద వెధవ.

256
00:19:40,680 --> 00:19:41,973
నిన్నది ఆశ్చర్యపరిచిందా?

257
00:19:42,807 --> 00:19:44,684
అంటే, నిజానికి లేదు, ఏమో తెలియదు.

258
00:19:47,353 --> 00:19:49,147
అతను ఇక్కడేం చేస్తున్నాడు?

259
00:19:53,276 --> 00:19:56,571
హే! మీరు నా గురించి మాట్లాడుతున్నారు.

260
00:19:57,488 --> 00:19:59,407
నాతో ఏమన్నా చెప్పాలంటే,

261
00:19:59,490 --> 00:20:02,452
ఇక్కడికి వచ్చి నా ముఖం పైన చెప్పండి.

262
00:20:04,329 --> 00:20:06,539
ఇంగ్లీషులో చెప్పండి.

263
00:20:10,418 --> 00:20:11,669
ఇక ఆపు.

264
00:20:13,212 --> 00:20:15,590
నా గురించి ఏదో చెత్త వాగుతున్నాడు, కదా?

265
00:20:15,673 --> 00:20:17,592
ఎలానూ నువ్వు నన్ను నమ్మవు.

266
00:20:25,266 --> 00:20:27,143
నువ్వు వాళ్ళను గమనించాలి, బిల్లి.

267
00:20:28,061 --> 00:20:29,354
అందరినీ.

268
00:20:30,897 --> 00:20:32,607
వాళ్ళు నిరాశావాదులు.

269
00:20:42,492 --> 00:20:43,701
దానికి క్షమించు.

270
00:20:44,827 --> 00:20:46,412
అతను ఒక విచిత్రమైనవాడు.

271
00:20:47,705 --> 00:20:51,501
ఈ భవంతి అంతా ఫ్రాంక్ సొంతం,
మన లీజ్ రద్దు చేయలేడని అతనికి కోపం.

272
00:20:51,584 --> 00:20:53,002
భవంతి అతని సొంతమా?

273
00:20:53,836 --> 00:20:55,296
మొత్తం బ్లాక్ అతని సొంతం.

274
00:20:56,756 --> 00:20:57,799
నమ్మలేకపోతున్నా.

275
00:20:58,508 --> 00:20:59,467
ఇంకా ఒకటి కావాలా?

276
00:21:00,343 --> 00:21:01,803
అవును, కావాలి.

277
00:21:58,943 --> 00:22:00,862
డాటా ఫలితాల సారాంశం
డీ-3 ఈ-2 డీ+3 జీ0 ఈ0 జీ0 సీ+1 వీ*+1 సీ*+5

278
00:22:00,945 --> 00:22:03,364
విశ్లేషణ: ఆర్‌హెచ్-హెచ్‌ఆర్ స్థాయిలు
ఆమోదయోగ్యానికి మించాయి

279
00:22:07,076 --> 00:22:08,911
డేవ్, మనం అది మళ్ళీ చేయాలి.

280
00:22:10,580 --> 00:22:11,664
కేట్!

281
00:22:12,373 --> 00:22:13,249
ఫెర్న్.

282
00:22:13,332 --> 00:22:15,084
అంకుల్ జార్జ్‌కు అప్‌డేట్ కావాలి.

283
00:22:16,085 --> 00:22:19,589
పాస్తా తయారీ క్లాసుకు వెళుతున్నాను.
నా వంట నైపుణ్యం పెంచుకోవాలి.

284
00:22:19,672 --> 00:22:21,758
-అతని ఉద్దేశ్యం తెలుసుగా.
-సమయం కావాలి.

285
00:22:21,841 --> 00:22:24,385
-ఇప్పుడు ఉదయం పదయ్యింది.
-నేను అన్నది అది కాదు.

286
00:22:24,469 --> 00:22:27,805
అవును. కానీ నాకు అనవసరం.

287
00:22:39,776 --> 00:22:40,943
దేవుడా.

288
00:22:43,446 --> 00:22:44,489
ఏంటి?

289
00:22:44,572 --> 00:22:47,325
ఏవా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు.
అత్యవసరం.

290
00:22:47,992 --> 00:22:48,993
ఎందుకు?

291
00:22:49,535 --> 00:22:52,330
నాకు తెలియదు,
ఆమె అత్యవసరం అని చెప్పారంతే...

292
00:22:58,836 --> 00:23:01,631
ప్యాటీ. లోపలకు రా. తలుపు వేసేయ్.

293
00:23:04,425 --> 00:23:06,260
సరే, కూర్చో. హాయ్.

294
00:23:13,768 --> 00:23:15,520
అయితే, ఈ ఉదయం భాగస్వాములు

295
00:23:15,603 --> 00:23:18,773
అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు,
నీ సమ భాగస్వామ్యానికి

296
00:23:18,856 --> 00:23:21,234
ఓటు వేశామని నీకు తెలియచేయాలని అనుకున్నాను.

297
00:23:27,323 --> 00:23:29,325
నువ్వు ఉద్యోగిగా తొలగించబడతావు.

298
00:23:29,408 --> 00:23:32,203
అయితే, ఇక డబ్ల్యూ-2లు ఉండవు,
రాయితీలు ఉండవు.

299
00:23:32,286 --> 00:23:36,624
నీ కొత్త పన్నుల స్థితిని మార్గదర్శకం
చేయగల యోగ్యమైన ఆర్థిక ప్లానర్‌ను

300
00:23:36,707 --> 00:23:39,252
నువ్వు పెట్టుకోవాలని
సిఫార్సు చేస్తున్నాను.

301
00:23:43,840 --> 00:23:45,216
నీకు అయోమయంగా ఉంది.

302
00:23:47,009 --> 00:23:49,095
ప్యాటీ, నీకు అనుకూలంగా ఓటు పడింది.

303
00:23:49,178 --> 00:23:51,556
అందుకని, నువ్వు ఇకపై ఉద్యోగినివి కావు,

304
00:23:51,639 --> 00:23:55,393
కానీ మార్గొలిస్ అండ్ ట్రూ
యజమాని-నిర్వహకురాలివి, సమ భాగస్వామివి.

305
00:24:07,655 --> 00:24:08,906
అది ఎంత?

306
00:24:09,866 --> 00:24:10,908
సరే, ఖచ్చితంగా.

307
00:24:17,957 --> 00:24:20,001
సరే, సూపర్. బాగుంది.

308
00:24:20,084 --> 00:24:23,546
నువ్వు నీ జీవిత బీమా
పాలసీ గురించి మాట్లాడాలంటే,

309
00:24:23,629 --> 00:24:25,047
ఇది మంచి సమయం.

310
00:24:25,840 --> 00:24:28,259
-నేను జీవిత బీమా తీసుకోవాలా?
-లేదు.

311
00:24:28,342 --> 00:24:31,387
సంస్థ పాలసీ తీసుకుంటుంది,
సంస్థే లబ్ధిదారు అవుతుంది.

312
00:24:31,470 --> 00:24:34,724
నీకు ఏమైనా జరిగితే. దేవుడు కరుణించాలి.

313
00:24:35,641 --> 00:24:38,603
బాగుంది.

314
00:24:38,686 --> 00:24:41,439
అవును. బాగుంది. అభినందనలు, ప్యాటీ.

315
00:24:41,981 --> 00:24:42,982
ధన్యవాదాలు.

316
00:24:46,110 --> 00:24:48,613
-అంతే.
-అంతే. సరే.

317
00:24:51,949 --> 00:24:53,534
-ఇంకా, ప్యాటీ?
-ఏంటి?

318
00:24:55,328 --> 00:24:56,829
నీకు నేను ఓటు వేయలేదు.

319
00:24:59,498 --> 00:25:03,294
అయ్యో. లేదు. నేను అది ఆలోచించలేదు. సరే.

320
00:25:03,669 --> 00:25:06,964
-తలుపు మూసేయ్.
-సరే. మూస్తాను. ధన్యవాదాలు.

321
00:25:11,302 --> 00:25:13,262
ఏమండి. పిన్నులు, సూదులు.

322
00:25:15,389 --> 00:25:17,433
సామ్
ఏవా నీకు (క్షమాపణ) చెబుతానని అనింది

323
00:25:17,516 --> 00:25:18,976
అభినందనలు!!!!

324
00:25:19,060 --> 00:25:20,645
అవును!
సంతోషం

325
00:25:23,064 --> 00:25:24,315
అవును!

326
00:25:24,398 --> 00:25:25,691
ఏంటి సంగతులు, ట్రావిస్?

327
00:25:25,775 --> 00:25:27,109
హే. ఏంటి సంగతులు, కేట్?

328
00:25:27,193 --> 00:25:28,945
-మా అంకుల్ వచ్చారా?
-ఇంకా రాలేదు.

329
00:25:29,028 --> 00:25:32,323
మస్టాంగ్‌కు నిన్న ఏమయిందో నీకు చూపించాలి.

330
00:25:32,406 --> 00:25:34,325
నువ్వు ఏడుస్తావు, అది బాధాకరం.

331
00:25:34,408 --> 00:25:36,494
లేదు. అయ్యో.

332
00:25:36,577 --> 00:25:39,121
ఐదు ని.ల్లో జరిగింది.
స్టార్‌బక్స్‌ను గుద్దేశా.

333
00:25:39,914 --> 00:25:41,123
ఏది నడుపుతావు?

334
00:25:42,083 --> 00:25:44,335
-2011 జీటీ.
-మంచిది.

335
00:25:44,418 --> 00:25:45,753
వికారమైన గీత మర్చిపో.

336
00:25:45,836 --> 00:25:50,591
సరే, అవి నిన్ను ఆకర్షిస్తాయి, సరే.
నా దగ్గర '66 మస్టాంగ్ కన్వర్టబుల్ ఉంది.

337
00:25:50,675 --> 00:25:53,886
అదిప్పుడు నా కూతురు దగ్గర ఉంది,
నా దగ్గర చాలా కాలం ఉంది.

338
00:25:53,970 --> 00:25:55,972
-అదృష్టవంతురాలు.
-నాకు తెలుసు.

339
00:25:56,055 --> 00:25:57,056
కేట్.

340
00:25:57,682 --> 00:25:58,683
అంకుల్ జార్జ్.

341
00:25:59,141 --> 00:26:01,394
వెచ్చని కాంతిలో నిన్ను చూడడం బాగుంటుంది.

342
00:26:01,477 --> 00:26:04,397
నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?

343
00:26:04,480 --> 00:26:09,527
ఈయన బిల్లి మెక్‌బ్రైడ్, టిల్లింజర్‌ను
ఓడించి, 60 కోట్లు రాబట్టిన లాయర్.

344
00:26:10,319 --> 00:26:12,697
మా సెటిల్మెంట్ అప్పుడు
మీరు లేకపోవడం మంచిదైంది.

345
00:26:13,364 --> 00:26:14,615
జార్జ్ జాక్స్.

346
00:26:15,241 --> 00:26:18,995
అవును, నాకు తెలుసు.
మీరు నిందను తిప్పికొట్టడం చూశాను.

347
00:26:20,997 --> 00:26:23,416
మా ఉత్పత్తిని సరిగా వాడితే అది సురక్షితం.

348
00:26:23,499 --> 00:26:24,500
నిజంగానా?

349
00:26:25,001 --> 00:26:28,713
నా మేనకోడలు ఇక్కడ ల్యాబ్ నడుపుతుంది.
తననే అడగండి.

350
00:26:30,256 --> 00:26:32,842
ట్రిమడోన్ సరిగా వాడితే అది సురక్షితమే.

351
00:26:33,884 --> 00:26:37,221
సరే, కానీ మరణాలు
దాన్ని భిన్నంగా చూపుతున్నాయి.

352
00:26:37,972 --> 00:26:40,308
మా కేసు పరిష్కారమయింది, బిల్లి. అందుకని...

353
00:26:41,142 --> 00:26:44,395
నేను రాత్రంతా ఇక్కడే ఉండి
తిరిగి దావా వేయించుకోవాలి.

354
00:26:44,478 --> 00:26:47,565
లేదా నేను చల్లని మార్టీని,
గొడ్డు మాంసం తీసుకోవాలి.

355
00:26:47,648 --> 00:26:51,319
దానికి ఆలోచించనవసరం లేదు. ఆకలిగా ఉందా?

356
00:26:52,445 --> 00:26:54,322
అవును, నకనకలాడుతున్నాను.

357
00:26:55,406 --> 00:26:56,615
కలవడం సంతోషం, బిల్లి.

358
00:26:57,575 --> 00:26:59,994
రస్సెల్ డ్రగ్‌ను శిక్షించడంలో
శుభం కలగాలి.

359
00:27:00,077 --> 00:27:01,370
అభినందిస్తున్నాను.

360
00:27:16,719 --> 00:27:17,803
ఆలస్యమయింది.

361
00:27:18,304 --> 00:27:19,180
పరవాలేదు.

362
00:27:20,348 --> 00:27:22,975
వస్తుంటే దారిలో తుళ్ళి పడ్డాను, అందుకని...

363
00:27:23,059 --> 00:27:24,101
అవునా? బానే ఉన్నావా?

364
00:27:24,185 --> 00:27:26,854
బాగానే ఉన్నాను. అది నా మోచేతికి...

365
00:27:27,646 --> 00:27:31,525
ఇంకా నా ఆత్మాభిమానానికి గాయం అయింది,
కానీ పరవాలేదు.

366
00:27:32,276 --> 00:27:34,236
మనం ఇది మరోసారి చేయొచ్చు.

367
00:27:34,320 --> 00:27:37,698
ఖచ్చితంగా కాదు.
రోజంతా దీనికోసం ఎదురు చూశాను.

368
00:27:37,782 --> 00:27:39,909
-మీ కోటు తీయనా?
-ధన్యవాదాలు.

369
00:27:40,826 --> 00:27:43,579
-బార్‌లో ఉంటే ఏం అమనుకోరుగా?
-లేదు, నాకు పరవాలేదు.

370
00:27:47,041 --> 00:27:50,544
అయితే, నాకు జార్జ్ జాక్స్ కలిశాడు.

371
00:27:51,128 --> 00:27:53,672
-ఇక్కడికి వచ్చాడా?
-అవును. అక్కడ ఉన్నాడు.

372
00:27:55,174 --> 00:27:58,386
అది సరదాగా ఉండి ఉంటుంది.
అతనో పెద్ద వెధవ.

373
00:27:59,178 --> 00:28:01,263
అవును. నేను అది ఒప్పుకుంటాను.

374
00:28:03,015 --> 00:28:05,518
అవును. వద్దు, ధన్యవాదాలు.

375
00:28:07,186 --> 00:28:10,731
సరే, లేదు, మాకు అది మాట్లాడే ఆసక్తి ఉంది.

376
00:28:11,607 --> 00:28:12,817
నేను అతనికి చెబుతాను.

377
00:28:15,236 --> 00:28:18,614
సరే, రేపు ఉదయం మాట్లాడదాం. ధన్యవాదాలు, బై.

378
00:28:20,866 --> 00:28:24,703
రస్సెల్ డ్రగ్ తరఫున పరిష్కారంపై
గ్రిఫిన్ పెటాక్ మాట్లాడాలనుకుంటున్నాడు.

379
00:28:24,787 --> 00:28:26,872
బాగా ఊహించారు. అవును.

380
00:28:26,956 --> 00:28:28,416
దానికి మేధావి కానవసరం లేదు.

381
00:28:29,708 --> 00:28:30,793
పరిష్కారానికా?

382
00:28:31,794 --> 00:28:32,962
పరిష్కారానికి.

383
00:28:34,505 --> 00:28:36,924
నేను ఇది తాగను. నాకు తలనొప్పి వస్తుంది.

384
00:28:37,007 --> 00:28:38,217
పరవాలేదు.

385
00:28:39,885 --> 00:28:44,056
అయితే, విచారణకు
అస్సలు వెళ్ళాలని అనుకోవడం లేదా?

386
00:28:46,392 --> 00:28:48,477
ఏది సరైనదో అది చేసే ఆసక్తి ఉంది.

387
00:28:48,561 --> 00:28:51,147
అది పరిష్కారమయితే,
మనం అదే చేయాలి.

388
00:28:53,315 --> 00:28:57,319
అంటే, నేను ఇప్పుడే ప్రారంభించినట్టు ఉంది.
కానీ అంటే, అర్థం చేసుకోగలను.

389
00:28:58,362 --> 00:29:02,741
నేను కేవలం, అంటే,
అది దాదాపుగా ముగిసిందని ఉపశమనం పొందాను.

390
00:29:04,994 --> 00:29:07,955
అవును, మీ సంస్థకు
అర్థికంగా తిరిగి పుంజుకునేందుకు

391
00:29:08,038 --> 00:29:09,790
ఈ పెద్ద సెటిల్మెంట్లు సహాయపడతాయి.

392
00:29:14,587 --> 00:29:15,796
అది మీకు ఎలా తెలుసు?

393
00:29:17,131 --> 00:29:18,466
నాకు తెలియదు.

394
00:29:23,679 --> 00:29:24,805
మీరు ఒక వెధవ.

395
00:29:25,431 --> 00:29:27,016
వాళ్ళు అదే అంటారు.

396
00:29:30,811 --> 00:29:32,396
అయితే, ఏం జరిగింది?

397
00:29:35,065 --> 00:29:37,318
మా నాన్న చనిపోగానే, అందరూ వెళ్ళిపోాయారు.

398
00:29:38,652 --> 00:29:42,907
అంటే, కొంతమంది క్లయింట్లు ఉన్నారు,
కానీ చాలామటుకు వెళ్ళిపోయారు.

399
00:29:43,657 --> 00:29:44,992
అవును, అది కష్టమైనది.

400
00:29:45,075 --> 00:29:46,118
అవును.

401
00:29:46,869 --> 00:29:51,415
చాలా మంది "మాకు బాధగా ఉంది" అన్నారు,
పరామర్శలు, పూలు పంపారు.

402
00:29:52,041 --> 00:29:56,712
బహుమతి బుట్టలు, కానీ సంస్థను
బహుమతి బుట్టలతో నడపలేము, అందుకని...

403
00:29:58,130 --> 00:30:00,508
అయినా, నాకు అర్థమయింది. అవును.

404
00:30:00,591 --> 00:30:05,804
నా పెట్టుబడులన్నీ
దెబ్బతిన్న వస్తువులపైన పెట్టను. అందుకని...

405
00:30:06,597 --> 00:30:09,266
నీ గురించి నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు.

406
00:30:11,227 --> 00:30:15,314
నేను రక్త నాళాలు గడ్డకట్టే వ్యాధి ఉన్న
మహిళను. వాళ్ళు నన్నలానే చూస్తారు.

407
00:30:15,397 --> 00:30:19,109
నాకు దెబ్బతిన్న వస్తువుల గురించి
కొంచెం తెలుసు. కానీ నువ్వు కాదు.

408
00:30:21,695 --> 00:30:22,947
మీరు చాలా మంచివారు.

409
00:30:24,114 --> 00:30:25,324
అది నిజం.

410
00:30:29,954 --> 00:30:32,665
అంటే, నేను ఈపాటికి చనిపోయి ఉండాలి.

411
00:30:33,707 --> 00:30:36,252
అంటే, అది నిజంగా జనాన్ని భయపెడతుంది.

412
00:30:36,335 --> 00:30:37,711
సరేలే.

413
00:30:37,795 --> 00:30:39,255
నేను మీతో హాస్యమాడడం లేదు.

414
00:30:40,881 --> 00:30:42,925
డాక్టర్ నాకు మూడేళ్ళు ఉన్నాయన్నారు.

415
00:30:45,553 --> 00:30:47,638
మూడున్నర ఏళ్ళయింది.

416
00:30:49,223 --> 00:30:53,686
సరే, ఇదిగో ఇక్కడ ఉన్నావు. చూశావా?
ఎవరికీ ఏదీ తెలియదు.

417
00:30:58,816 --> 00:31:00,609
డాక్టర్లకు విషయాలు తెలుస్తాయి.

418
00:31:01,068 --> 00:31:02,570
డాక్టర్లు చాలా చెబుతారు.

419
00:31:03,821 --> 00:31:06,824
నన్ను కాల్చారు,
నేను చనిపోయాను, తిరిగి వచ్చాను.

420
00:31:06,907 --> 00:31:09,410
నీతో ఇక్కడ కూర్చున్నా,
వాళ్ళది చెప్పలేకపోయారు.

421
00:31:11,912 --> 00:31:15,332
మనకు తెలియనివి చాలా ఉన్నాయి.

422
00:31:15,416 --> 00:31:16,333
నీకు తెలుసా?

423
00:31:16,417 --> 00:31:19,169
మనం ఒక్కోసారి మన జీవితాలను చూసి గర్వపడతాం.

424
00:31:21,088 --> 00:31:26,427
లేదా బహుశా అదృష్టమో,
లేదా రాసిపెట్టిన సమయమో, నాకు తెలియదు.

425
00:31:28,554 --> 00:31:29,722
అవును.

426
00:31:34,893 --> 00:31:36,562
అవును, అదలా అనిపించడం లేదు...

427
00:31:38,105 --> 00:31:39,398
రాసిపెట్టిన సమయంలా.

428
00:31:58,334 --> 00:31:59,501
ఛ.

429
00:32:03,213 --> 00:32:04,590
పరవాలేదు.

430
00:32:06,550 --> 00:32:08,552
-నిజంగా, అది...
-మీరు వెళతారా?

431
00:32:10,054 --> 00:32:12,765
నన్ను వెళ్ళమంటావా?
వెళ్ళు, అంటే ఏంటి?

432
00:32:12,848 --> 00:32:15,225
నాకు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఉంది,

433
00:32:15,309 --> 00:32:18,479
కానీ నేను మళ్ళీ
బొక్కబోర్లా పడలేను, అందుకని...

434
00:32:22,524 --> 00:32:23,609
సరే.

435
00:32:26,111 --> 00:32:29,615
నేను వెళ్ళి సిగరెట్ తాగి వస్తాను,
కానీ ఒక్క నిమిషంలో వస్తాను.

436
00:32:35,496 --> 00:32:37,748
కఠినమైన ప్రేమ ఏమో,
దాన్ని అలా అనవచ్చు.

437
00:32:37,831 --> 00:32:41,460
నాకు అతన్ని గాయపరచాలని లేదు,
కానీ చేతులు ఎత్తేయకపోతే,

438
00:32:41,543 --> 00:32:43,045
గట్టిగా దెబ్బ తగులుతుంది.

439
00:32:43,837 --> 00:32:45,464
డిలన్ పిచ్చివాడు.

440
00:32:45,547 --> 00:32:47,633
మీకు మంచి పోరాడే భాగస్వామి కావాలి.

441
00:32:48,300 --> 00:32:49,218
ఫెర్న్ మాటేంటి?

442
00:32:51,595 --> 00:32:56,016
అంటే, ఆమెకు చాలా కోపం ఎక్కువ.
అంతేకాకుండా, అందుకోగలదు.

443
00:32:56,725 --> 00:32:58,477
బహుశా నేను తన్నించుకోవాలేమో.

444
00:33:00,646 --> 00:33:01,689
సరే.

445
00:33:03,565 --> 00:33:06,819
ఈ భోజన ఖర్చు సంస్థది కాబట్టి
మనం వ్యాపారం మాట్లాడాలి.

446
00:33:07,611 --> 00:33:09,905
అమర్జిన్ ఎంత వరకు వచ్చింది?

447
00:33:10,948 --> 00:33:14,451
అంకుల్ జార్జ్,
మీకు ఇది వినడం నచ్చదని తెలుసు కానీ...

448
00:33:14,535 --> 00:33:18,288
సరే. నేను వినకూడనిది వినాలా?

449
00:33:18,956 --> 00:33:21,291
-నాకు తెలుసు, కానీ...
-నేను ఏం వినాలి?

450
00:33:21,375 --> 00:33:23,585
-మనమిది చర్చించాము. మీరన్నారు...
-కేట్?

451
00:33:30,050 --> 00:33:33,095
అమర్జిన్‌లో వ్యసన వ్యతిరేక భాగం
బాగా పని చేస్తుంది.

452
00:33:35,180 --> 00:33:38,058
మంచిది. ఇంకా?

453
00:33:40,602 --> 00:33:43,021
జాగ్రత్తగా, తెలివిగా ముందుకెళ్ళాలి.

454
00:33:46,859 --> 00:33:51,363
కానీ దీర్ఘకాల దుష్ప్రభావాలు
ఎఫ్‌డీఏ నిబంధనల ప్రకారం లేకపోతే?

455
00:33:53,157 --> 00:33:56,452
నేను నువ్వు చెప్పింది సరిగా వినలేదనుకుంటా.

456
00:33:57,828 --> 00:33:58,954
మళ్ళీ చెప్పు.

457
00:34:00,205 --> 00:34:02,791
-మీరు మాటిచ్చినంత సమయం నాకుంటే...
-సరే, లేదు...

458
00:34:03,625 --> 00:34:05,627
మనం భిన్నమైన అంశాలు మాట్లాడుతున్నాం.

459
00:34:08,130 --> 00:34:10,132
ఇదే సమయం, కేట్.

460
00:34:11,300 --> 00:34:14,511
ఇదే సరైన సమయం.

461
00:34:16,847 --> 00:34:18,599
నువ్వు మళ్ళీ ప్రయత్నిస్తావా?

462
00:34:20,642 --> 00:34:24,980
అమర్జిన్ వ్యసనంకానిది,
ప్రభావవంతమైన నొప్పి తగ్గించే నల్లమందు.

463
00:34:25,731 --> 00:34:28,233
ఎఫ్‌డీఏ అమోదించినది,
అమ్మకానికి సిద్ధమైనది.

464
00:34:30,819 --> 00:34:32,571
సరే, అది మంచి వార్త.

465
00:34:34,823 --> 00:34:36,033
నీ మాంసం ఎలా ఉంది?

466
00:34:50,214 --> 00:34:51,381
హే, ఏంటి సంగతులు?

467
00:34:51,465 --> 00:34:54,051
హే, నీకు సామ్ చెప్పిందా?

468
00:34:54,134 --> 00:34:55,135
ఏంటది?

469
00:34:55,928 --> 00:35:00,140
నాకది దక్కింది.
నాకు సమ భాగస్వామ్యం దక్కింది.

470
00:35:00,849 --> 00:35:02,017
సరే, అది మంచిది.

471
00:35:02,100 --> 00:35:06,396
అవును, మూలధన సహకారం చాలా ఎక్కువ,
కానీ అది కాకుండా...

472
00:35:06,480 --> 00:35:09,817
సరే, సమ భాగస్వామ్య ప్రపంచానికి స్వాగతం.

473
00:35:09,900 --> 00:35:12,236
మంచి వార్త చెప్పినందుకు ధన్యవాదాలు.

474
00:35:13,987 --> 00:35:16,615
నేను వెళ్ళాలి. బై.

475
00:35:19,493 --> 00:35:20,577
మేడం?

476
00:35:23,997 --> 00:35:26,375
హే! హాయ్.

477
00:35:26,458 --> 00:35:27,960
-హాయ్.
-అమ్మా...

478
00:35:28,043 --> 00:35:30,546
-మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు?
-అమ్మా.

479
00:35:30,629 --> 00:35:33,590
పద ఆ "అమ్మ" ఎక్కడ ఉందో చూద్దాం. రా.

480
00:35:34,216 --> 00:35:36,218
సరే. నాకు తెలుసు.

481
00:35:36,301 --> 00:35:38,053
-ఇజీ?
-వెళతావా?

482
00:35:38,220 --> 00:35:41,139
అయ్యో, దేవుడా. క్షమించు.
తను మాయమయిపోయింది ఇంకా...

483
00:35:41,223 --> 00:35:45,519
-తను మీ పాపా? "అమ్మ" వద్దకు వెళతావా?
-ఇది అత్యవసరంగా పాపాయిని చూసుకునే స్థితి.

484
00:35:45,602 --> 00:35:48,814
పిల్లలను చూసుకోవడంలో
నేను జాగ్రత్తగానే ఉంటాను.

485
00:35:48,897 --> 00:35:50,732
-తను నా ఆఫీసుకు వచ్చింది.
-క్షమించు.

486
00:35:50,816 --> 00:35:52,901
-అందుకని తీసుకున్నాను.
-అమ్మ కింద ఉంది.

487
00:35:52,985 --> 00:35:55,445
తనకు నాపై చాలా కోపంగా ఉంది.
పద వెళదాం, ఇజీ.

488
00:35:55,529 --> 00:35:58,699
-దయచేసి ఇప్పుడు ఇలా చేయకు.
-నేను కిందకు రాగలను.

489
00:35:58,782 --> 00:35:59,825
-అవునా?
-అవును.

490
00:35:59,908 --> 00:36:01,869
-ఏమీ అనుకోకపోతే.
-పరవాలేదు.

491
00:36:01,952 --> 00:36:04,288
కిందకు వెళతావా?
ఆ "అమ్మ"ను చూద్దాము.

492
00:36:04,371 --> 00:36:05,581
అమ్మను చూద్దాము.

493
00:36:05,664 --> 00:36:07,249
-సరే.
-ధన్యవాదాలు.

494
00:36:15,132 --> 00:36:18,594
అభినందనలు.
నీ భాగస్వామ్యానికి. అది బాగుంది.

495
00:36:18,677 --> 00:36:21,471
-ధన్యవాదాలు.
-సరే. నువ్వు అది సంపాదించావు.

496
00:36:22,764 --> 00:36:23,891
నేను సంపాదించాను.

497
00:36:24,683 --> 00:36:25,517
అవునా?

498
00:36:27,227 --> 00:36:29,813
హే! బై!

499
00:36:30,606 --> 00:36:31,857
హే, బంగారం.

500
00:36:33,942 --> 00:36:35,068
-పద వెళదాం.
-క్షమించు.

501
00:36:36,653 --> 00:36:37,779
బై.

502
00:36:37,863 --> 00:36:39,573
ఏం జరిగింది? తను తప్పిపోయిందా?

503
00:36:39,656 --> 00:36:41,158
లేదు, అస్సలు లేదు.

504
00:36:41,241 --> 00:36:42,367
అవును, సరే.

505
00:36:42,451 --> 00:36:44,578
ఎందుకు ఎప్పుడూ అలా ఆలోచిస్తావు...

506
00:37:45,138 --> 00:37:49,601
మిస్ మార్గొలిస్ బిల్ కట్టారు.
మీకు ఏమైనా కావాలా?

507
00:37:50,519 --> 00:37:51,979
లేదు. నా కోటు కావాలి.

508
00:37:53,772 --> 00:37:55,649
-శుభరాత్రి.
-సరే.

509
00:39:51,473 --> 00:39:52,599
హే, బిల్లి.

510
00:39:53,642 --> 00:39:54,976
నా పేరు టాం ట్రూ.

511
00:39:56,061 --> 00:39:57,187
మనం మాట్లాడాలి.

512
00:39:59,439 --> 00:40:00,774
సరే, లోపలికి రండి.

513
00:40:04,986 --> 00:40:09,449
బిల్లి, మీరు ఇక్కడికి
ఎలా వచ్చారో ఆలోచించాలి.

514
00:40:11,827 --> 00:40:12,994
ఇది ఏంటి?

515
00:40:13,620 --> 00:40:16,873
ఇది న్యాయవాద సలహా లేఖ,
కూపర్‌మాన్ నుండి మెక్‌బ్రైడ్‌కు.

516
00:40:17,582 --> 00:40:19,459
మీరు జాక్స్ ఫార్మాకు పనిచేశారు.

517
00:40:27,300 --> 00:40:28,135
కూపర్‌మాన్ / మెక్‌బ్రైడ్

518
00:40:28,218 --> 00:40:30,470
ఆంతరంగిక పత్రం
న్యాయవాద-క్లయింట్ ప్రత్యేక హక్కు

519
00:40:30,554 --> 00:40:31,638
విలియం మెక్‌బ్రైడ్

520
00:40:31,721 --> 00:40:33,014
"1995."

521
00:40:34,933 --> 00:40:37,769
అది 25 ఏళ్ళ క్రితం. నాకు అది గుర్తు లేదు.

522
00:40:37,853 --> 00:40:39,146
మీకు గుర్తుండాలని లేదు.

523
00:40:39,229 --> 00:40:41,731
నేను ఇలాంటి ఉత్తరాలు కొన్ని వేలు రాశాను.

524
00:40:41,815 --> 00:40:43,817
నాకు వాటిలో చాలా గుర్తులేవు.

525
00:40:44,401 --> 00:40:48,488
నిజానికి, మీరు తమ దగ్గర పని చేసినట్టు
మీకు గుర్తుండదని జాక్స్ నమ్మారు.

526
00:41:00,167 --> 00:41:02,335
"ప్రారంభ ల్యాబ్ రిపోర్ట్‌ల ప్రకారం,

527
00:41:03,628 --> 00:41:08,967
"అమర్జిన్ ఆరోగ్యానికి ప్రమాదం కలిగిస్తుంది
అది మానవ ఉపయోగానికి సురక్షితం కాదు.

528
00:41:09,050 --> 00:41:12,762
"మీరు వెంటనే ఆ మందు పరిశోధన,
అభివృద్ధి అంతా వెంటనే నిలిపివేయాలి,

529
00:41:12,846 --> 00:41:15,015
"క్లినికల్ ట్రయల్స్‌తో సహా,

530
00:41:15,098 --> 00:41:18,268
"ఆ ఉత్పత్తిని ఎఫ్‌డీఏ
అమోద ప్రక్రియ నుండి తొలగించాలి."

531
00:41:18,977 --> 00:41:20,645
ఇంకా మిగిలినవి.

532
00:41:20,729 --> 00:41:22,898
"సాదరంగా సమర్పించాం..."
అవును, నేనే.

533
00:41:22,981 --> 00:41:27,194
కాదా? అయితే, జాక్స్ మీ సలహాను పాటించి,
అమర్జిన్‌ను కొనసాగించకుండా,

534
00:41:27,861 --> 00:41:30,530
బదులుగా ట్రిమడోన్‌ను
మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

535
00:41:30,614 --> 00:41:33,408
కానీ అప్పుడు, అంటే, అది అంత ముఖ్యం కాదు.

536
00:41:34,367 --> 00:41:37,829
నేను జాక్స్ కోసం పని చేశాను,
అందుకని నేను వారిపై దావా వేయలేను.

537
00:41:37,913 --> 00:41:40,248
నేను బహిర్గతం చేయగలినదేదీ చేయలేను.

538
00:41:41,124 --> 00:41:43,877
ఒకసారి క్లయింట్ అయితే, ఎప్పటికీ క్లయింటే.

539
00:41:44,753 --> 00:41:46,338
చెత్త వెధవ.

540
00:41:50,300 --> 00:41:52,969
వినండి, మనం ఇంకొంచెం ముందు
కలిసుంటే బాగుండేది,

541
00:41:53,053 --> 00:41:56,348
కానీ మీరు జాక్స్‌తో
కలిసి ఉన్నారో లేదో తెలియదు.

542
00:41:56,431 --> 00:41:59,017
సరే, మీరు జాగ్రత్తగా ఉండడం తప్పుబట్టలేను.

543
00:41:59,643 --> 00:42:03,605
మీకు ఇది ఎక్కడ దొరికింది?
ఇది ఆంతరంగిక వస్తువు.

544
00:42:03,688 --> 00:42:04,564
అవును.

545
00:42:04,648 --> 00:42:07,734
జాక్స్ అంతర్గత వ్యక్తులనుండి
దొరికి ఉండాలి. ఉన్నత స్థాయి.

546
00:42:07,817 --> 00:42:08,944
నాకు ఒక ఫోన్ వచ్చింది.

547
00:42:09,945 --> 00:42:11,029
మీకు ఫోన్ వచ్చిందా?

548
00:42:12,739 --> 00:42:13,740
సరే.

549
00:42:15,742 --> 00:42:18,119
గ్రెగ్ వెట్జెల్ అనుకున్న కాల్.

550
00:42:18,203 --> 00:42:19,996
అవును. కాదు, అది ఒక మహిళ నుండి.

551
00:42:20,080 --> 00:42:23,333
ముప్ఫై, నలభై ఉంటాయేమో?
పేరు చెప్పలేదు, ఆందోళనగా ఉంది.

552
00:42:24,376 --> 00:42:27,504
తరువాతి రోజు, తలుపు నుండి
తోసిన ఈ ఉత్తరం కనిపించింది.

553
00:42:27,587 --> 00:42:30,298
వాళ్ళు గ్రెగ్‌ వెట్జెల్‌ను
మీ అపార్ట్‌మెంట్‌లో ఉంచారు.

554
00:42:30,382 --> 00:42:32,050
నేను అతన్ని కనుగొనాలనుకున్నారు.

555
00:42:32,133 --> 00:42:35,720
ఆ తరువాత నేను టిల్లింజర్‌తో
బెదిరించి పరిష్కారం చేసుకుంటాను.

556
00:42:36,596 --> 00:42:40,725
వాళ్ళు సమాచారాన్ని నష్టపరుస్తున్న
ఈ వెట్జెల్‌ను వదిలేసినట్టయితే,

557
00:42:40,809 --> 00:42:43,228
వాళ్ళు ఏదో చాలా దారుణమైనది దాస్తున్నారు.

558
00:42:43,311 --> 00:42:46,690
మిమ్మల్ని 60 కోట్ల డాలర్లతో దూరం చేస్తే
జాక్స్ ట్రిమడోన్

559
00:42:46,773 --> 00:42:50,026
పంపిణీలో వాళ్ళు
ఎంత డబ్బు సంపాదించారో ఆలోచించండి.

560
00:42:51,903 --> 00:42:55,365
నా అంతరాత్మ చెబుతున్నది,
వాళ్ళు చాలా సులువుగా తప్పించుకున్నారు.

561
00:42:57,117 --> 00:43:01,162
అయితే, నాకు ఈ లేఖ దొరికాక,
నన్ను నేను రక్షించుకునేందుకు దాక్కున్నాను.

562
00:43:02,497 --> 00:43:06,543
మార్గొలిస్ అండ్ ట్రూ మిమ్మల్ని
నియమించుకుంది, విలియం మెక్‌బ్రైడ్,

563
00:43:06,626 --> 00:43:10,672
జాక్స్ ఫార్మా పైన
తిరిగి దావా వేసే అర్హత లేని వాడిని.

564
00:43:16,011 --> 00:43:18,179
ఇది పొరపాటు కాదు. తెలివైనది.

565
00:43:19,139 --> 00:43:22,976
అంటే, మీకు ఎవరు తెలివైన వారో తెలుసు.
అది జార్జ్ జాక్స్ కాదు.

566
00:43:24,936 --> 00:43:26,229
సామ్.

567
00:43:26,313 --> 00:43:27,397
సామ్.

568
00:43:30,025 --> 00:43:32,193
మీ అపార్ట్‌మెంట్ తాళాలు నాకు ఇచ్చింది.

569
00:43:32,944 --> 00:43:34,571
అంటే, అది సంస్థ సొంతం.

570
00:43:34,654 --> 00:43:37,574
ఖచ్చితంగా, ఆమెకు మీకు సాయం చేయాలని ఉంది.

571
00:43:47,542 --> 00:43:49,794
నేను తనను నా సొంత కూతురులా ప్రేమించాను.

572
00:43:51,963 --> 00:43:52,922
ప్రేమిస్తాను.

573
00:43:56,343 --> 00:43:59,429
కానీ సామ్, ప్రపంచ భారాన్ని మోస్తుంది, కదా?

574
00:43:59,512 --> 00:44:02,807
తను కేవలం తన తండ్రి సంస్థను
దివాళా నుండి కాపాడాలని అనుకుంది.

575
00:44:02,891 --> 00:44:05,393
దానికోసం రాక్షసుడితో చేతులు కలిపింది.

576
00:44:11,566 --> 00:44:12,901
నేను చాలా నిరాశ చెందాను.

577
00:44:16,654 --> 00:44:19,157
సామ్యూల్‌కు తన కూతురును
చూసుకుంటానని మాటిచ్చా.

578
00:44:21,076 --> 00:44:22,702
బహుశా ఇంకా ఆలస్యం కాలేదేమో.

579
00:44:22,786 --> 00:44:24,037
నాకు తెలియదు.

580
00:44:24,829 --> 00:44:28,291
బహుశా మీకు ఏదైనా దారి దొరుకుతుందేమో,
మీరు నాకంటే మంచి లాయర్.

581
00:44:29,167 --> 00:44:30,627
నాకు అది తెలియదు,

582
00:44:31,795 --> 00:44:35,465
కానీ మనం దీనిపై కలిసి పని చేయవచ్చు.
నా కళ్ళు బాగా తెరుచుకున్నాయి.

583
00:44:40,053 --> 00:44:41,221
అవును.

584
00:44:41,971 --> 00:44:43,390
నేను ఇది అభినందిస్తున్నాను.

585
00:44:44,641 --> 00:44:45,767
సరే.

586
00:44:52,315 --> 00:44:53,441
సరే, నేను ఫ్రాంక్‌ను.

587
00:44:54,984 --> 00:44:58,154
అతనికి ఫోన్ ఇవ్వు, అమ్మాయ్!

588
00:45:01,616 --> 00:45:03,993
పొరుగువారు కలత చెందుతున్నారు.

589
00:47:39,274 --> 00:47:41,276
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

590
00:47:41,359 --> 00:47:43,361
క్రియేటివ్ సూపర్వైజర్
వలవల రాజేశ్వర రావు

