1
00:00:07,007 --> 00:00:09,885
టామ్ క్లాన్సీ రచించిన జాక్ రైన్

2
00:00:55,681 --> 00:00:57,558
నేను చెప్పిన పనులు పూర్తిచేసారా?

3
00:01:07,359 --> 00:01:08,986
బయటికి వెళ్దాం పదండి.

4
00:01:09,069 --> 00:01:10,529
నువ్వు కూడా పద.

5
00:01:32,343 --> 00:01:35,554
బీకా లోయ
లెబనాన్ - 1983

6
00:01:38,098 --> 00:01:40,184
వచ్చి తీసుకోండి, వెధవల్లారా.

7
00:01:51,487 --> 00:01:52,863
తమాషా కాదు!

8
00:02:56,010 --> 00:02:59,096
వాషింగ్టన్ డి.సి. - ప్రస్తుతం

9
00:03:47,770 --> 00:03:49,146
చూసుకోరా వెధవా!

10
00:03:53,400 --> 00:03:54,610
వెధవ.

11
00:04:13,754 --> 00:04:16,465
సెంట్రల్ ఇంటలిజెన్్స ఏజెన్సీ
అమెరికా సంయుక్త రాష్ట్రాలు

12
00:04:27,726 --> 00:04:30,813
డా. రైన్, నిన్న మీ ఓరియోల్్స జట్టు
ఘోరంగా ఓడిపోయింది.

13
00:04:30,896 --> 00:04:33,691
ఇంకా ఘోరంగా ఉండేది హెరాల్్డ.
నేను మెట్్స జట్టు అభిమానిని.

14
00:04:38,112 --> 00:04:39,780
తీవ్రవాద ఆర్థిక మరియు ఆయుధాల శాఖ

15
00:04:48,914 --> 00:04:51,417
గురువారంలోగా వాళ్ళని
పట్టుకునేలా చూద్దాం.

16
00:04:51,709 --> 00:04:54,253
ఇవాళ యెమెన్ సమయం
పాటిస్తున్నామా డా. రైన్?

17
00:04:54,336 --> 00:04:55,421
లేదు మేడం.

18
00:04:55,838 --> 00:04:57,172
సరే, మొదలుపెడదాం.

19
00:04:57,256 --> 00:05:00,009
నిన్న రాత్రి ఫోర్్ట నుండి కొన్ని
తాజా హూతి సిగింట్ వచ్చాయి.

20
00:05:00,092 --> 00:05:02,261
పొద్దున ఈమెయిల్ లో
వరుస లింకులు ఉన్నాయి.

21
00:05:02,636 --> 00:05:06,724
యూరోప్ ఇస్లామాబాద్ యొక్క స్విఫ్్ట
లావాదేవీలన్నీ చూడాలని సిటిసి కోరింది.

22
00:05:06,807 --> 00:05:07,808
చెప్పు పాట్రిక్.

23
00:05:15,733 --> 00:05:16,734
చెప్పండి?

24
00:05:18,777 --> 00:05:19,653
అలాగే సర్.

25
00:05:21,071 --> 00:05:22,072
మీరు లోపలికి వెళ్ళవచ్చు.

26
00:05:34,251 --> 00:05:35,252
జిమ్.

27
00:05:38,172 --> 00:05:39,298
కూర్చో.

28
00:05:41,925 --> 00:05:42,885
అయితే,

29
00:05:43,719 --> 00:05:44,970
నీ సెలవు ఎలా గడిచింది?

30
00:05:46,221 --> 00:05:47,264
సుదీర్ఘంగా.

31
00:05:52,561 --> 00:05:54,688
నాగ్్స హెడ్ తీరానికి పడవలో వెళ్ళాను.
చేపలు పట్టాను.

32
00:05:55,731 --> 00:05:57,399
-అవును.
-ప్రశాంతంగా అనిపిస్తుంది.

33
00:06:00,319 --> 00:06:01,195
జాస్మిన్ ఎలా ఉంది?

34
00:06:02,696 --> 00:06:03,572
నాకు తెలీదు.

35
00:06:05,365 --> 00:06:07,493
ఒక్కసారే చూసాను. లాయర్ దగ్గర.

36
00:06:08,827 --> 00:06:10,370
క్షమించు, పెళ్ళి ఉంగరం
ఇంకా ఉంది కదా,

37
00:06:10,454 --> 00:06:13,332
మీరిద్దరూ కలిసుండడానికి
ప్రయత్నిస్తున్నారని అనుకున్నాను.

38
00:06:19,129 --> 00:06:23,258
పదవీ విరమణ చేస్తున్న చీఫ్
టి-ఫాడ్ నీ కొరకు తయారుచేసిన

39
00:06:23,342 --> 00:06:24,510
అవసరమైన విషయాలున్న పుస్తకం ఇది.

40
00:06:24,593 --> 00:06:27,638
ఈ గ్రూపులో చాలా వరకు విశ్లేషకులు,
కొందరు కేస్ అధికారులు ఉన్నారు...

41
00:06:27,721 --> 00:06:30,724
ట్రెజరీ మరియు జస్టిస్
నుండి ప్రతినిధులు ఉంటారు.

42
00:06:32,601 --> 00:06:34,019
నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరు.

43
00:06:40,400 --> 00:06:43,487
జిమ్, ఇది నువ్వు కావాలనుకుంటే,
బాగానే ఉంటుంది.

44
00:06:44,863 --> 00:06:46,698
ఇది పురోగతి లేని పదవి, నేట్.

45
00:06:47,491 --> 00:06:48,867
అది మనిద్దరికీ తెలుసు.

46
00:06:49,868 --> 00:06:51,495
ఇది రెండవ అవకాశం.

47
00:06:51,578 --> 00:06:54,540
ఇంకో విషయం, ఇక్కడున్న చాలామంది
ఈ పదవి అందుకునేంత అర్హత...

48
00:06:55,374 --> 00:06:56,500
నీకు లేదని అనుకుంటున్నారు.

49
00:07:03,257 --> 00:07:04,133
ఇప్పుడు...

50
00:07:10,556 --> 00:07:13,183
అన్నట్టు, జిమ్?
ముందే స్పష్టంగా చెప్తున్నాను,

51
00:07:13,976 --> 00:07:15,477
నేను నీ తరఫున మాట్లాడాను.

52
00:07:16,228 --> 00:07:17,688
నన్ను తలదించుకునేలా చేయకు.

53
00:07:29,741 --> 00:07:32,995
ఈ వారం అల్ అరేబియా ఛానెల్లో
పోరాటం పైన ప్రత్యేక ప్రసారం ఉంది,

54
00:07:33,078 --> 00:07:35,038
చూడాల్సిన వాటిలో ఒకటి.

55
00:07:35,122 --> 00:07:36,290
ఎక్కడ దొరుకుతుంది?

56
00:07:36,373 --> 00:07:39,042
-ఓఎస్ సి దానిని ఆన్ లైన్లో పెట్టి--
-శుభోదయం.

57
00:07:41,295 --> 00:07:42,296
నా పేరు జేమ్్స గ్రీర్.

58
00:07:43,088 --> 00:07:44,339
నేను మీ కొత్త గ్రూప్ చీఫ్ ని.

59
00:07:45,924 --> 00:07:47,092
అబ్బా.

60
00:07:48,385 --> 00:07:50,220
గతంలో అతను కరాచిలో స్టేషన్ చీఫ్.

61
00:07:51,805 --> 00:07:53,724
పరిచయాలు చేసుకుంటే బాగుంటుంది కదా?

62
00:07:53,807 --> 00:07:57,352
లేచి పరిచయం చేసుకుని, మీరు
దేని పైన పని చేస్తున్నారో చెప్పండి.

63
00:07:59,021 --> 00:08:00,189
నీతో మొదలు పెడదాం.

64
00:08:00,689 --> 00:08:03,400
హాయ్, సర్. నేను టేరెక్ కసర్,
పాడ్ లో పని చేస్తున్నాను.

65
00:08:04,109 --> 00:08:06,945
ప్రస్తుతం ఇస్లామాబాద్ హవాలా
వ్యవస్థపై కవరేజీ కొరకు

66
00:08:07,029 --> 00:08:08,947
సిగింట్ కనుగొంటున్నాను.

67
00:08:09,031 --> 00:08:09,948
మంచిది.

68
00:08:10,741 --> 00:08:12,826
నోరీన్ యాంగ్. యూరోప్
పై పని చేస్తున్నాను.

69
00:08:12,910 --> 00:08:16,038
ఫ్రెంచ్, బెల్జియం ఆస్థుల నుండి
అనుసంధాన సమాచారం ఆధారంగా

70
00:08:16,121 --> 00:08:19,374
స్విఫ్్ట లావాదేవీల పైన రెండవ రౌండ్
విశ్లేషణ పూర్తి చేసాం సర్.

71
00:08:23,837 --> 00:08:25,422
నీ వంతు, లాన్్స ఆర్్మస్ట్రాంగ్.

72
00:08:29,760 --> 00:08:31,970
జాక్ రైన్.
నేను యెమెన్ పై పనిచేస్తున్నాను.

73
00:08:32,054 --> 00:08:35,390
ఏడెన్ చుట్టూ ఉన్న స్విఫ్్ట నెట్వర్్క
లావాదేవీలను పర్యవేక్షిస్తున్నాను.

74
00:08:36,016 --> 00:08:36,850
ఇంకా?

75
00:08:39,853 --> 00:08:40,687
ఇంకా...

76
00:08:43,690 --> 00:08:45,734
నిజానికి, గత కొద్ది నెలల్లో,

77
00:08:45,817 --> 00:08:49,571
వీటిలో చాలా లావాదేవీలు అనుమానాస్పదంగా
ఉన్నాయని హెచ్చరిక పెట్టాను.

78
00:08:50,781 --> 00:08:51,823
అనుమానాస్పదమా?

79
00:08:53,116 --> 00:08:54,117
ఎందుకలా?

80
00:08:54,660 --> 00:08:58,205
వాణిజ్యానికి సంబంధించని భారీ స్విఫ్్ట
లావాదేవీలు వ్యక్తులకు బదిలీ కావడం,

81
00:08:58,288 --> 00:08:59,873
అదికూడా యెమెన్ లో జరగడం
అక్రమంగా అనిపిస్తుంది.

82
00:08:59,957 --> 00:09:03,418
సాధారణ స్విఫ్్ట లావాదేవీలు
ఒక క్రమంలో ఉంటాయి--

83
00:09:03,502 --> 00:09:04,711
నీ సందేహం ఏంటి?

84
00:09:06,046 --> 00:09:07,089
సమస్య ఏంటి?

85
00:09:10,759 --> 00:09:11,677
వద్దు.

86
00:09:13,303 --> 00:09:17,015
నా సిధ్ధాంతం ప్రకారం

87
00:09:17,641 --> 00:09:21,103
ఈ లావాదేవీల వెనకున్న వ్యక్తి
ఉన్నత స్థాయి టార్గెట్ అయ్యి ఉంటాడు.

88
00:09:23,855 --> 00:09:24,773
ఎవరు?

89
00:09:25,399 --> 00:09:26,817
అదీ, అంటే, ప్రస్తుతం నేను

90
00:09:28,151 --> 00:09:29,778
-స్పష్టంగా చెప్పలేను--
-అతనెవరు?

91
00:09:33,615 --> 00:09:35,200
అతని పేరు సులేమాన్ అని నా నమ్మకం.

92
00:09:36,159 --> 00:09:37,744
దానర్థం "శాంతిని కాంక్షించే వ్యక్తి."

93
00:09:37,828 --> 00:09:39,913
అతను ఈ మధ్యే సిటిసి
యెమెన్ రాడర్ లో కనిపించాడు.

94
00:09:40,539 --> 00:09:43,041
ఆర్.హెచ్. అసెట్్స కూడా అతని
గురించి ఉదహరించాయి.

95
00:09:43,125 --> 00:09:43,959
అంతేనా?

96
00:09:45,210 --> 00:09:46,628
వాళ్ళొక పేరు విన్నారా?

97
00:09:47,379 --> 00:09:48,922
వాళ్ళు ఇంకా ఏం చెప్పారు?

98
00:09:51,216 --> 00:09:53,885
వాళ్ళు ఏం చెప్పారని కాదు సర్,
ఎలా చెప్తున్నారనేది ముఖ్యం.

99
00:09:53,969 --> 00:09:56,305
అంటే, వాళ్ళు ఇతని గురించి
చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు,

100
00:09:56,388 --> 00:09:58,056
నేను మతాభిమానం గురించి చెప్పట్లేదు.

101
00:09:58,181 --> 00:10:00,809
అతను షియా, సున్నీలు
ఇద్దరికీ విన్నపాలు చేస్తున్నాడు.

102
00:10:01,059 --> 00:10:02,185
ఆహా.

103
00:10:03,020 --> 00:10:05,480
నా మొదటిరోజే సరికొత్త బిన్ లాడెన్.
అస్సలు ఊహించలేదు.

104
00:10:08,150 --> 00:10:11,403
ఈ అజ్ఞాత వ్యక్తి గురించి
నీకొక్కడికే ఎలా తెలుసు?

105
00:10:11,486 --> 00:10:13,905
అంటే, సమాచారాన్ని ఒక చోటకి
చేర్చడంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే

106
00:10:13,989 --> 00:10:16,783
ఒకదానితో ఒకటి సంభాషించని రెండు డేటా
బేస్ లతో వ్యవహరించవలసి రావడం.

107
00:10:16,867 --> 00:10:18,744
అందుకే నేను ఒక

108
00:10:18,869 --> 00:10:20,287
-కస్టం ఎస్.క్యు.ఎల్. క్వెరీ రాసా--
-తరువాత.

109
00:10:24,541 --> 00:10:27,210
హాయ్. నేను ప్యాట్రిక్.
సిరియా కవర్ చేస్తాను.

110
00:10:30,047 --> 00:10:32,382
ఎస్.క్యు.ఎల్. క్వెరీనా? నిజంగానా?

111
00:10:32,466 --> 00:10:33,717
నువు అక్కడికి వెళ్ళావా, రైన్?

112
00:10:33,800 --> 00:10:35,594
ఆపరేషన్్స వాళ్ళకి మ్యాపులు,
గ్రాఫిక్్స ఇష్టం.

113
00:10:35,677 --> 00:10:38,889
ఈ సారి నీ నివేదికలలో బొమ్మలు
అతికించి ప్రరయత్నించు.

114
00:10:38,972 --> 00:10:41,600
అతన్ని తిరిగి ప్రధాన కార్యాలయానికి
ఎందుకు పంపించారో ఎవరికైనా తెలుసా?

115
00:10:42,726 --> 00:10:45,103
ఎడారిలో కల్నల్ కర్్టజ లాగా
నిరంకుశంగా ప్రవర్తించాడట

116
00:10:45,187 --> 00:10:48,690
ఎస్ ఏ డి వాళ్ళ బుల్లెట్లు పంది
రక్తంలో ముంచేలా చేసాడంట

117
00:10:48,774 --> 00:10:50,692
వీళ్ళు చంపిన వాళ్ళు ఎవరూ
స్వర్గానికి పోకుండా ఉండడానికి

118
00:10:50,776 --> 00:10:52,069
-దేవుడా.
-అబ్బా.

119
00:10:52,152 --> 00:10:53,028
అవును.

120
00:11:17,636 --> 00:11:21,306
అల్ మ్నాజీర్, సిరియా

121
00:12:24,286 --> 00:12:25,620
స్వాగతం, షేక్ అల్ రద్వాన్.

122
00:12:26,329 --> 00:12:27,456
పదండి...

123
00:12:27,622 --> 00:12:29,833
షేక్ సులేమాన్ ఇంట్లో ఉన్నాడా?

124
00:12:30,000 --> 00:12:31,585
ఆయనింకా ఇంటికి రాలేదు.

125
00:12:31,668 --> 00:12:32,627
ఎప్పుడు రావచ్చు?

126
00:12:32,752 --> 00:12:34,129
మీరు దయచేసి...

127
00:12:34,254 --> 00:12:36,506
నా భర్త పనులు ఆయనకి సంబంధించినవి.

128
00:12:51,563 --> 00:12:52,898
అలెప్పో నుండి
ఒక సోదరుడిని తీసుకువచ్చాం.

129
00:12:53,648 --> 00:12:55,692
అతన్ని ఇక్కడ మీతో ఉంచమని
మీ భర్త కోరాడు.

130
00:12:58,278 --> 00:12:59,112
ఇక్కడా?

131
00:13:00,155 --> 00:13:00,989
మాతోనా?

132
00:13:04,284 --> 00:13:05,952
మీరు అన్నట్టు...

133
00:13:06,620 --> 00:13:09,206
మీ భర్త పనులు, ఆయనకే సంబంధించినవి.

134
00:13:12,876 --> 00:13:15,003
షేక్ సులేమాన్ తిరిగి వచ్చిన తరువాత...

135
00:13:15,128 --> 00:13:17,255
షేక్ అల్ రద్వాన్
కలవాలన్నాడని చెప్పండి.

136
00:13:55,210 --> 00:13:58,213
"వాంపెనాగ్్సతో 1621లో
 చేసుకున్న ఒప్పందం"

137
00:13:58,296 --> 00:14:01,007
యాత్రికులకు ఈ తెగ నుండి
 రక్షణను అందించింది

138
00:14:01,091 --> 00:14:03,510
-దాన్నిప్పుడు రోడ్ ఐలాండ్ అంటారు.
-నారగాన్సెట్.

139
00:14:05,136 --> 00:14:08,723
ఈ తెగ పేరు నారగాన్సెట్.
 లోనీ, మొదలుపెట్టు.

140
00:14:08,807 --> 00:14:10,809
మార్్చ మ్యాడ్నెస్, 200.

141
00:14:10,892 --> 00:14:14,896
"ఈ బట్టలుతికే పదార్థం వల్ల ఎలిజిబెత్
 ఫ్యాన్సీ కాలర్ ఉతకడం సాధ్యమయ్యింది...

142
00:14:15,021 --> 00:14:17,274
-హలో?
 -జాక్! ఎలా ఉన్నావు?

143
00:14:17,941 --> 00:14:19,150
హే, జోయీ.

144
00:14:19,526 --> 00:14:20,902
ఎంతకాలం అయ్యింది, నాలుగేళ్ళా?

145
00:14:22,737 --> 00:14:24,114
ఐదనుకుంటాను.

146
00:14:24,823 --> 00:14:26,241
నీ నిద్ర పాడుచేయలేదు కదా?

147
00:14:26,324 --> 00:14:27,993
ఏం కావాలి, జోయీ?

148
00:14:28,618 --> 00:14:30,787
మనం కలిస్తే బాగుంటుంది.

149
00:14:30,870 --> 00:14:32,914
నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి.

150
00:14:32,998 --> 00:14:34,583
ఇప్పుడే మాట్లాడుకోవచ్చు.

151
00:14:34,666 --> 00:14:37,085
లేదు, ఆ విషయం ఫ్లోన్లో మాట్లాడను.

152
00:14:37,711 --> 00:14:39,296
ఆదివారం ఇంటికి రా.

153
00:14:39,421 --> 00:14:42,173
నా పుట్టిన రోజుకి
 చిన్న పార్టీ ఏర్పాటు చేసాను.

154
00:14:42,257 --> 00:14:44,175
పెద్దదేమీ కాదు. కొద్దిమంది
 స్నేహితులు, బంధువులు అంతే.

155
00:14:44,259 --> 00:14:46,052
-ఇల్లెక్కడో గుర్తుంది కదా?
-గుర్తుంది.

156
00:14:46,136 --> 00:14:48,179
నీకు తెలుసా?
ఆహ్వానించినందుకు సంతోషం జో, కాని...

157
00:14:48,263 --> 00:14:49,222
జాక్.

158
00:14:49,598 --> 00:14:52,017
నీ మాజీ బాస్ గా అడగట్లేదు.

159
00:14:52,100 --> 00:14:54,019
నీ స్నేహితుడిగా కోరుతున్నాను.

160
00:14:57,230 --> 00:14:58,940
-సరే.
 -మంచిది.

161
00:14:59,691 --> 00:15:01,484
1:00 కల్లా వచ్చెయ్యి. కలుద్దాం మరి.

162
00:15:01,776 --> 00:15:02,902
బాగుంది.

163
00:15:03,486 --> 00:15:07,449
"31 బిసి ఆక్టియమ్
 నౌకా యుధ్ధాన్ని గెలవడానికి"

164
00:15:07,532 --> 00:15:10,994
ఆక్టేవియన్ ఇతని బలగాలని
 సాధ్యమైన అన్నివిధాలుగా ముంచేసాడు."

165
00:15:11,995 --> 00:15:13,163
మార్్క ఆంటొనీ.

166
00:15:13,872 --> 00:15:15,749
ఆక్టేవియన్, మార్్క ఆంటొనీని ఓడించాడు.

167
00:16:47,090 --> 00:16:48,258
శోధన ఫలితాలు 1207

168
00:17:29,215 --> 00:17:30,592
హే, జాక్.

169
00:17:31,259 --> 00:17:33,094
నీ కొరకు బ్లూబెర్రీ
డానిష్ తీసుకువచ్చాను.

170
00:17:33,178 --> 00:17:34,429
ధన్యవాదాలు, తెరెసా.

171
00:17:36,014 --> 00:17:37,474
కాఫీ?

172
00:17:37,557 --> 00:17:39,392
కావాలి. ఒక్క క్షణం ఉండు. ధన్యవాదాలు.

173
00:17:40,310 --> 00:17:41,644
సర్, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా?

174
00:17:41,728 --> 00:17:43,730
మేధావి? నీకైతే ఒకటేంటి
ఐదు నిమిషాలు ఇస్తాను.

175
00:17:49,694 --> 00:17:50,612
లోపలికి రా.

176
00:17:51,029 --> 00:17:52,322
ఏం చెప్పాలి?

177
00:17:52,572 --> 00:17:54,115
నేను ఒకటి కనుక్కున్నాను,
మీరు చూసి తీరాలి.

178
00:17:56,701 --> 00:17:57,619
ఏంటిది?

179
00:17:57,702 --> 00:18:00,955
ఇవి ట్రాక్ యూరో అనే యాప్ తో
చేసిన ఆర్థిక లావాదేవీలు.

180
00:18:01,039 --> 00:18:02,332
సెల్ ఫోన్ ని ఉపయోగిస్తారు.

181
00:18:02,415 --> 00:18:04,626
అవును, నేను వచ్చేసే ముందు
వాళ్ళు కరాచీలో ఉపయోగిస్తున్నారు.

182
00:18:04,709 --> 00:18:08,254
ఈ లావాదేవీలలో ప్రతి ఒక్కటి
ఈ ఖాతాకి లింక్ అయ్యి ఉంది.

183
00:18:08,338 --> 00:18:12,008
ఈ ఖాతాను పది రోజుల క్రితం ఏడెన్ లోని
ఒక బ్యాంకులో ఒక సౌదీ సంస్థ తెరిచింది.

184
00:18:12,091 --> 00:18:16,304
కానీ ఈ సంస్థ వ్యాపార లైసెన్్స తీసుకుని
నెల కంటే తక్కువ అయ్యింది.

185
00:18:16,888 --> 00:18:18,097
ఇది బినామీ.

186
00:18:18,973 --> 00:18:20,391
-సరే.
-అయితే...

187
00:18:20,892 --> 00:18:24,729
గత ఎనిమిది రోజులుగా ఆరు స్విఫ్్ట
లావాదేవీలు జరిగాయి.

188
00:18:24,813 --> 00:18:28,399
వాటి మొత్తం విలువ 90 లక్షల డాలర్లు.

189
00:18:28,483 --> 00:18:30,401
నేను పర్యవేక్షిస్తున్న అన్ని ఖాతాలలో,

190
00:18:30,485 --> 00:18:33,279
రెండు మాత్రమే లకారాలని దాటాయి,
అది కూడా అతి కష్టం పైన.

191
00:18:34,364 --> 00:18:36,241
పెద్ద లావాదేవీలు
దృష్టిని ఆకర్షిస్తాయి.

192
00:18:36,324 --> 00:18:38,117
పెద్ద లావాదేవీలతో మన
రాడార్ దృష్టిలో ఎందుకు పడతాడు?

193
00:18:38,201 --> 00:18:40,495
అతనికి దృష్టిని ఆకర్షించడం గురించి
ఆలోచించే అవసరం లేదేమో

194
00:18:40,578 --> 00:18:43,081
ఎందుకంటే అతని ప్రణాళిక ఏదైనా,
ఇప్పుడు సిధ్ధంగా ఉన్నాడు.

195
00:18:43,164 --> 00:18:44,541
ఇతనే. దొరికాడు.

196
00:18:44,916 --> 00:18:47,460
"ఇతనా"? అంటే సులేమాన్ కదా.

197
00:18:48,837 --> 00:18:51,965
సర్, అతను ఉన్నది వాస్తవం.
ప్రమాణపూర్తిగా అతను నిజంగా ఉన్నాడు.

198
00:18:53,258 --> 00:18:55,134
20 సంవత్సరాల క్రితం
మొదటిసారి బిన్ లాడెన్

199
00:18:55,218 --> 00:18:57,178
అనే పేరు విన్నప్పుడు
ఇలాంటి అవకాశం లభిస్తే సంతోషించే

200
00:18:57,262 --> 00:18:59,347
వాళ్ళు మన ఏడవ అంతస్థులో
ఉన్నారంటారా?

201
00:19:01,558 --> 00:19:03,810
నేను కోరుతుంది ఒక్కటే,
తుది హెచ్చరిక చేయండి.

202
00:19:03,893 --> 00:19:05,270
ఈ ఖాతాని నిలిపివేయండి.

203
00:19:16,364 --> 00:19:17,699
నువ్వింకా అసలు విషయానికి రాలేదు.

204
00:19:20,827 --> 00:19:22,120
ఇంకా అసలు విషయానికి రాలేదా?

205
00:19:26,583 --> 00:19:27,500
సార్,

206
00:19:28,209 --> 00:19:30,837
9/11కి ఐదు లక్షల డాలర్లు ఖర్చు
అయ్యింది.

207
00:19:30,920 --> 00:19:35,008
అతను ఉన్నది నిజం అయితే, అందుకు 20
రెట్ల డబ్బుతో ఏం చేస్తాడో ఊహించగలరా?

208
00:19:35,091 --> 00:19:36,885
మనం దీని అంతు చూడాలి.

209
00:19:36,968 --> 00:19:39,804
డబ్బు లేకుంటే, అతనూ ఉండడు.
అంతవరకు మాట ఇవ్వగలను.

210
00:19:40,597 --> 00:19:42,348
తుది హెచ్చరిక ఆదేశించి,
ఖాతాని నిలిపివెయించండి.

211
00:19:42,432 --> 00:19:43,641
ఇంకా ఏమైనా ఉందా?

212
00:20:38,196 --> 00:20:40,156
ఆలివ్ నూనె

213
00:21:17,193 --> 00:21:18,736
నేను టీ తీసుకువచ్చాను.

214
00:21:19,946 --> 00:21:20,989
క్షమించండి.

215
00:21:21,823 --> 00:21:23,533
నాకు అరబిక్ సరిగ్గా రాదు.

216
00:21:25,702 --> 00:21:27,453
మనం ఆంగ్లంలో మాట్లాడుకోవచ్చు.

217
00:21:29,163 --> 00:21:30,289
మీకు టీ కావాలా?

218
00:21:32,375 --> 00:21:33,334
ధన్యవాదాలు.

219
00:21:50,935 --> 00:21:52,770
అతను భయపడుతున్నాడు
 కాబట్టే సంకోచిస్తున్నాడు.

220
00:21:52,854 --> 00:21:54,647
భయపడుతున్నాడా? గ్రీర్?

221
00:21:55,773 --> 00:21:57,692
ఎంత ఘోరంగా పని చేసి ఉంటే
బేస్ కి ఛీఫ్ పదవి నుండి

222
00:21:57,775 --> 00:22:00,611
టి-ఫాడ్ అధికారి పదవికి పడిపోతాడు.

223
00:22:01,362 --> 00:22:03,531
తను ఇంకో పొరపాటు చేయలేడు,
అది అతనికి తెలుసు.

224
00:22:03,656 --> 00:22:05,033
నువ్వు చెప్పేది నిజమే అయినా,

225
00:22:05,116 --> 00:22:08,494
తుది హెచ్చరిక ఇవ్వడానికి
నీకు హక్కులేదు. సరేనా?

226
00:22:08,578 --> 00:22:10,288
-అది-
-ట్రెజరీ పని. నాకు తెలుసు.

227
00:22:18,421 --> 00:22:19,422
జాక్.

228
00:22:33,603 --> 00:22:36,064
నాకు తెలీదు. గ్రీర్ ఏమంటాడు?

229
00:22:36,147 --> 00:22:37,648
నువ్వు గ్రీర్ కింద పని చేయట్లేదు.

230
00:22:38,357 --> 00:22:39,692
ట్రెజరీ స్వతంత్రమైనది.

231
00:22:41,736 --> 00:22:44,739
నీకు ఇష్టం లేకపోతే చేయకు,
నిజంగా అంటున్నాను.

232
00:22:45,782 --> 00:22:46,783
ఏదో...

233
00:22:47,784 --> 00:22:50,036
జనం ఊరికే "ట్రెజరీ
అసలు ఏమీ చేయదు" అని అంటూ

234
00:22:50,119 --> 00:22:51,704
ఉంటే విని బాధపడ్డాను

235
00:22:51,788 --> 00:22:52,663
అవును.

236
00:22:54,415 --> 00:22:55,416
అందుకని...

237
00:23:02,298 --> 00:23:04,050
సరే, చేద్దాం.

238
00:23:16,312 --> 00:23:18,397
అద్భుతం.

239
00:23:22,985 --> 00:23:24,153
అంతేనా?

240
00:23:24,278 --> 00:23:25,321
అవును.

241
00:23:26,989 --> 00:23:28,074
అవును, అంతే.

242
00:23:31,953 --> 00:23:33,329
-మంచి పని.
-ధన్యవాదాలు.

243
00:23:38,876 --> 00:23:40,503
కదలకుండా పట్టుకో.

244
00:23:45,091 --> 00:23:47,176
భోజనం సిధ్ధంగా ఉంది. వెళ్దాం పదండి.

245
00:23:47,260 --> 00:23:48,719
వెళ్ళి చేతులు కడుక్కోండి.

246
00:23:50,847 --> 00:23:51,722
అలాగే, అమ్మా.

247
00:24:17,665 --> 00:24:19,625
ఆలివ్ నూనె.

248
00:24:28,759 --> 00:24:29,677
గ్రీర్.

249
00:24:30,720 --> 00:24:31,554
జిమ్?

250
00:24:32,305 --> 00:24:33,139
పీట్?

251
00:24:33,556 --> 00:24:35,057
సిఐఎ అన్నెక్్స, యూ.ఎస్. ఎంబసీ
సనా, యేమెన్

252
00:24:35,141 --> 00:24:37,268
మా అసిస్టెంట్ తప్పు నంబరుకి
కలిపినట్టు ఉన్నాడు.

253
00:24:38,019 --> 00:24:40,479
నేను టి-ఫాడ్ చీఫ్ తో మాట్లాడాలి.

254
00:24:42,231 --> 00:24:43,941
అతనితోనే మాట్లాడుతున్నావు.

255
00:24:47,820 --> 00:24:49,155
ఏం కావాలి?

256
00:24:49,322 --> 00:24:51,699
మీరంతా ఆదేశించిన ఈ తుది
హెచ్చరిక గురించి కాల్ చేసాను.

257
00:24:53,284 --> 00:24:54,702
నేను తుది హెచ్చరిక ఆదేశించలేదు.

258
00:24:54,785 --> 00:24:57,288
మీ వాళ్ళలో ఒక ట్రెజరీ అధికారి
 ఎవరో ఆదేశించారు.

259
00:25:00,875 --> 00:25:02,668
-జిమ్?
-ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాను.

260
00:25:05,254 --> 00:25:07,131
రైన్! వెంటనే నా గదిలోకి రా!

261
00:25:26,025 --> 00:25:26,943
తలుపు వెయ్యి.

262
00:25:30,988 --> 00:25:33,115
ఏమీ చేయద్దు అని చెప్పాను,

263
00:25:33,199 --> 00:25:34,867
నువ్వు నాకు తెలియకుండా
ఖాతా నిలిపి వేయించావు!

264
00:25:34,951 --> 00:25:37,328
-అది ట్రెజరీ నిర్ణయం.
-ఆహా, అవునా!

265
00:25:37,703 --> 00:25:40,831
తుది హెచ్చరిక ఆదేశించింది వాళ్ళు
కావచ్చు, కానీ అది నీ ఆలోచన!

266
00:25:42,166 --> 00:25:45,127
దీనివల్ల మీ ఉద్యోగం పోతుందని అనుకుంటే
అలాంటిదేమీ జరగదు సరేనా?

267
00:25:45,211 --> 00:25:47,088
నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను.

268
00:25:47,171 --> 00:25:49,715
నీకలా అనిపిస్తుందా?
నేను నా ఉద్యోగం కాపాడుకుంటున్నానా?

269
00:25:49,799 --> 00:25:52,301
చుట్టూ చూడు. ఆ అవకాశం పోయింది.

270
00:25:55,513 --> 00:25:57,598
ఒక్క విషయం చెప్పు,
నువ్విది ఎంత కాలంగా చేస్తున్నావు?

271
00:25:58,140 --> 00:26:00,434
-దాదాపు నాలుగేళ్ళుగా.
-దాదాపు నాలుగేళ్ళుగానా!

272
00:26:00,518 --> 00:26:05,189
దేవుడా. ఇది చూసి నేనేమనాలి,
ఆహా, అద్భుతం అనాలా.

273
00:26:10,194 --> 00:26:12,530
నిజమే చెప్తున్నావు అనుకుందాం,

274
00:26:12,613 --> 00:26:14,949
సులేమాన్, లేకుంటే కాస్పర్ దెయ్యం,

275
00:26:15,032 --> 00:26:17,159
లేదా ఎవడైనా, నిజంగా ఉన్నాడనుకుందాం.

276
00:26:17,493 --> 00:26:20,579
తన బ్యాంక్ ఖాతాని ఒక
దేశ సంస్థ నిలిపివేసిందని

277
00:26:20,663 --> 00:26:22,331
కనుక్కుంటే ఏం చేస్తాడని
అనుకుంటున్నావు?

278
00:26:22,748 --> 00:26:24,583
ఎర వదిలేస్తాడు, నీకేమీ రాదు!

279
00:26:24,667 --> 00:26:27,753
మీకు తెలిసి, తొంభై లక్షల డాలర్లను
వదులుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు?

280
00:26:27,837 --> 00:26:30,423
-అతనికి ఆ డబ్బే సర్వస్వం.
-ఒప్పుకుంటున్నాను!

281
00:26:31,424 --> 00:26:32,967
అందుకే మనం బ్యాంక్ వద్ద కూర్చుని,

282
00:26:33,050 --> 00:26:34,844
వచ్చే పోయే ప్రతి
కొరియర్ ని గుర్తించి

283
00:26:34,927 --> 00:26:36,470
మొత్తం వ్యవస్థని మూసేయాల్సిందా!

284
00:26:36,554 --> 00:26:37,763
అవును.

285
00:26:38,848 --> 00:26:40,349
లేదా వాళ్ళు ఆ బ్యాంక్
బయటికి నడిచి వెళ్తుంటే,

286
00:26:40,433 --> 00:26:42,393
మనం ముందు తలుపు దగ్గర నిల్చుని
వాళ్ళింకో 9/11 చేస్తూ ఉంటే

287
00:26:42,476 --> 00:26:44,937
-చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలి.
-నా గది నుండి బయటికి వెళ్ళు.

288
00:27:06,292 --> 00:27:08,377
రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ బ్యాంకు

289
00:27:08,461 --> 00:27:10,463
ఏడెన్, యెమెన్

290
00:27:26,479 --> 00:27:28,314
బ్యాంక్ మేనేజర్ బయటికి వచ్చాడు.

291
00:28:24,495 --> 00:28:25,788
ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

292
00:28:26,705 --> 00:28:30,334
ఇద్దరు వయసులో ఉన్న మగవాళ్ళు,
బల్ల వద్ద, మార్కెట్ కి ఉత్తరం మూలలో.

293
00:28:40,719 --> 00:28:42,638
నాకు ఆ బల్ల వద్ద మాటలు వినిపించాలి.

294
00:28:47,143 --> 00:28:49,437
రహస్య పోలీస్.
మీ అపార్ట్మెంట్ తో అవసరం ఉంది.

295
00:29:08,914 --> 00:29:11,584
ఇక్కడ ఉండి గమనిస్తూ ఉన్నాను,
నా లక్ష్యంలో ఉన్నాడు.

296
00:29:30,561 --> 00:29:33,647
ఆ ఆడియోకి ఏదో అయ్యింది.
నాకేమీ వినిపించట్లేదు.

297
00:29:35,858 --> 00:29:38,444
దేవుడా. ఎవరైనా ఆ ఆడియోని
బాగు చేయగలరా?

298
00:29:38,527 --> 00:29:39,904
లిప్-రీడర్ ఎవరైనా ఉన్నారా?

299
00:29:43,115 --> 00:29:44,492
దేవుడా, మీరున్నారే.

300
00:29:50,372 --> 00:29:51,540
వాళ్ళు వెళ్తున్నారు.

301
00:29:52,500 --> 00:29:54,001
నాకు కనిపించట్లేదు.

302
00:29:54,335 --> 00:29:55,794
మనం ఏం చేయాలి?

303
00:30:01,967 --> 00:30:03,886
వాళ్ళు మార్కెట్ నుండి
బయటికి రాగానే పట్టుకుందాం.

304
00:30:03,969 --> 00:30:05,596
మరి బ్యాంక్ మేనేజర్?

305
00:30:06,013 --> 00:30:08,432
అతన్ని వదిలేయండి.
ఆ ఇద్దరినీ వెంటాడండి.

306
00:30:13,062 --> 00:30:15,314
పని పక్క వీధిలో పూర్తి చేద్దాం.

307
00:30:47,263 --> 00:30:48,097
క్షమించండి!

308
00:30:48,639 --> 00:30:49,640
దారి తప్పాను, సహాయపడగలరా?

309
00:31:15,541 --> 00:31:17,876
12 నావిక దళ వ్యక్తులు మృతి,
ఒకరు బ్రతికారు

310
00:31:32,141 --> 00:31:32,975
గ్రీర్.

311
00:31:33,684 --> 00:31:36,145
హే జిమ్, మళ్ళీ నేనే,
పీట్ కార్్టరైట్ ని.

312
00:31:37,396 --> 00:31:38,939
నువ్వు ఈ విషయం చెప్తే నమ్మవు.

313
00:32:04,590 --> 00:32:07,009
నాకేం తెచ్చావో చెప్తాను.
చేపల గాలం కదా?

314
00:32:07,926 --> 00:32:09,386
పుట్టిన రోజు శుభాకాంక్షలు, జో.

315
00:32:09,720 --> 00:32:11,764
ఎలా ఉన్నావు జాక్?
బాగా కనిపిస్తున్నావు.

316
00:32:11,847 --> 00:32:13,515
-ధృఢంగా ఉన్నావు.
-ధన్యవాదాలు.

317
00:32:13,599 --> 00:32:15,726
అయితే "కొందరే స్నేహితులు" అంటే ఇదేనా?

318
00:32:15,809 --> 00:32:18,145
-కొంచెం తక్కువ చేసి చెప్పాననుకుంటాను.
-అవును.

319
00:32:18,228 --> 00:32:19,688
-డ్రింక్ కావాలా?
-తప్పకుండా.

320
00:32:21,065 --> 00:32:22,650
హే బెన్, వచ్చినందుకు ధన్యవాదాలు.

321
00:32:23,734 --> 00:32:26,445
సరే, నన్నిక్కడికి రప్పించావు.
దేని గురించి మాట్లాడాలి?

322
00:32:26,570 --> 00:32:29,782
నా కొరకు నువ్వు ఒక పని చేసిపెట్టాలి.

323
00:32:29,907 --> 00:32:32,868
-పని ఉందని నాకు తెలుసు. విను, జో--
-లేదు, నువ్వు అనుకునేది కాదు.

324
00:32:32,951 --> 00:32:35,329
నేను దక్షిణ కొరియాకి చెందిన
సమర్థ పెట్టుబడిదారులతో

325
00:32:35,412 --> 00:32:37,498
ఒక నిధి నిర్వహిస్తున్నాను.
చాలా తీవ్రంగా.

326
00:32:37,915 --> 00:32:41,251
జో, నేను ఒక కారణం చేత
వాల్ స్ట్రీట్ వదిలేసాను.

327
00:32:41,335 --> 00:32:42,878
మళ్ళీ తిరిగి రాను.

328
00:32:42,961 --> 00:32:44,922
నిన్ను తిరిగి రమ్మని అడగట్లేదు.

329
00:32:45,589 --> 00:32:50,678
ఉత్తర కొరియా గురించి రాష్ట్ర శాఖ
అభిప్రాయం నాకు కావాలి.

330
00:32:50,761 --> 00:32:52,262
అక్కడ నా పని సాగదంటావా?

331
00:32:52,846 --> 00:32:54,139
దేవుడా, జో.

332
00:32:54,223 --> 00:32:56,350
అవును, అందుకే నేను ఫోన్లో మాట్లాడలేదు.

333
00:32:56,433 --> 00:32:58,727
సరే, ఈ పని నేను చేయలేను.

334
00:32:58,811 --> 00:33:00,437
రాష్ట్ర శాఖలో నాది ఆ రకం పని కాదు.

335
00:33:00,521 --> 00:33:02,356
నేనేమీ రహస్య సమాచారం అడగట్లేదు.

336
00:33:02,439 --> 00:33:04,733
మామూలుగా అభిప్రాయం
ఎలా ఉందని అడుగుతున్నాను.

337
00:33:04,817 --> 00:33:07,277
ఒక ఉత్తరువో ఏదో వచ్చి ఉండాలి కదా.

338
00:33:07,361 --> 00:33:09,238
అక్కడ పనులు అలా జరగవు.

339
00:33:11,907 --> 00:33:15,744
సరే, చూడు, జాక్. విషయానికి వస్తాను.

340
00:33:15,828 --> 00:33:17,287
ఇదివరకులా ఉండు.

341
00:33:18,622 --> 00:33:21,959
జో, నేను చేయలేను.

342
00:33:25,379 --> 00:33:29,049
ఈ నిజాయితీ, క్రమశిక్షణల
జీవితంలో ఉండే సమస్య ఏమిటంటే,

343
00:33:29,967 --> 00:33:32,302
ఒక రోజు నువ్వు మేలుకుని

344
00:33:33,053 --> 00:33:35,973
ఇదంతా అవసరం లేదని

345
00:33:36,056 --> 00:33:39,101
నిన్ను నువ్వు మోసం
చేసుకుంటున్నానని గ్రహిస్తావు.

346
00:33:40,269 --> 00:33:43,272
కానీ అప్పటికి ఆలస్యమైపోతుంది.

347
00:33:43,355 --> 00:33:44,314
జో.

348
00:33:45,023 --> 00:33:46,608
-గార్డీ!
-పుట్టిన రోజు శుభాకాంక్షలు.

349
00:33:46,692 --> 00:33:49,695
ధన్యవాదాలు! నువ్వు రాగలిగినందుకు
చాలా సంతోషంగా ఉంది.

350
00:33:49,778 --> 00:33:51,572
పార్టీ ఎంజాయ్ చెయ్యి.

351
00:33:58,787 --> 00:34:01,123
-దయచేసి ఒక బీర్ ఇస్తారా?
-రెండు చెప్పండి.

352
00:34:02,332 --> 00:34:04,460
విందుకు ఆహ్వానించిన వాళ్ళకి
కోపం తెప్పించడానికి మంచి మార్గమే.

353
00:34:08,130 --> 00:34:10,674
-అదంతా విన్నారా?
-ఆఖరి భాగం మాత్రమే.

354
00:34:10,758 --> 00:34:15,095
ఆయన మిమ్మల్ని "నిజాయితీ, క్రమశిక్షణ
గల జీవితం" అని అనడం నాకు నచ్చింది.

355
00:34:15,637 --> 00:34:18,182
సరే, కనీసం నేను వెధవనైతే కాదు కదా?

356
00:34:18,265 --> 00:34:19,349
నిజమే.

357
00:34:19,892 --> 00:34:21,977
-నేను జాక్.
-కాథీ.

358
00:34:22,561 --> 00:34:23,479
కాథీ.

359
00:34:26,023 --> 00:34:27,191
కాథీ మ్యూలరా?

360
00:34:28,984 --> 00:34:31,111
అయ్యో. మీరు జో కూతురు.

361
00:34:31,987 --> 00:34:34,782
-ఇంతకు ముందు కలిసామా?
-నిజానికి కలవలేదు.

362
00:34:35,407 --> 00:34:38,243
జో బల్ల వెనకాల మీ ఫోటో ఉండేది.

363
00:34:38,327 --> 00:34:42,289
అది వైద్య కళాశాల గ్రాడ్యువేషన్ ఫోటో.
అప్పుడు మీ జుట్టు పొడుగ్గా ఉండేది.

364
00:34:42,372 --> 00:34:46,293
-వినండి, మీ నాన్న గురించి అన్నది--
-వెధవ అనా? పర్లేదు.

365
00:34:50,255 --> 00:34:51,882
అయితే మీరు వైద్యురాలా? ఎక్కడ?

366
00:34:52,007 --> 00:34:55,385
వాషింగ్టన్ మెమోరియల్.
సంక్రమణ వ్యాధులు నా స్పెషలైజేషన్.

367
00:34:56,220 --> 00:34:57,805
-ఆహా. అది వినటానికి...
-అసహ్యంగా ఉంది కదా?

368
00:34:58,764 --> 00:35:01,391
-కొద్దిగా.
-మీ సంగతేంటి?

369
00:35:03,268 --> 00:35:04,520
రాష్ట్ర శాఖ.

370
00:35:04,978 --> 00:35:07,773
నేను పశ్చిమ అర్థగోళానికి
వ్యూహరచన సేకరణ చేస్తాను.

371
00:35:09,191 --> 00:35:10,317
అది వినటానికి...

372
00:35:11,652 --> 00:35:12,653
విసుగ్గా అనిపిస్తుంది కదా?

373
00:35:38,387 --> 00:35:39,680
డా. రైన్!

374
00:35:40,514 --> 00:35:41,974
డా. రైన్!

375
00:35:46,061 --> 00:35:47,479
డా. రైన్.

376
00:35:51,400 --> 00:35:54,111
నేను డిల్లర్్డ, అమెరికా తీర భద్రత
దళంలో రెండవ తరగతి అధికారిని.

377
00:35:54,194 --> 00:35:55,529
మీరు నాతో రావాలి.

378
00:35:55,612 --> 00:35:57,573
-సర్, మీ తాళం చెవులు ఇవ్వండి.
-ఏం ఇవ్వాలి?

379
00:35:57,656 --> 00:35:59,908
మీ కారును మీ ఇంటికి తీసుకు
వెళ్ళమని ఆదేశించారు.

380
00:35:59,992 --> 00:36:01,535
-సరే.
-రండి.

381
00:36:01,618 --> 00:36:03,245
ఒక్క క్షణం ఉండు.

382
00:36:04,746 --> 00:36:05,956
నాకు తెలీదు. బహుశా నేను--

383
00:36:06,039 --> 00:36:07,332
-సార్, మనం వెళ్ళాలి!
-సరే.

384
00:36:14,631 --> 00:36:16,008
ఎక్కండి సర్.

385
00:36:51,752 --> 00:36:53,587
సర్, తల కిందికి దించండి, సర్.

386
00:37:03,013 --> 00:37:05,057
ఏమయ్యింది? విమానం ఎక్కడం ఇష్టం లేదా?

387
00:37:05,182 --> 00:37:06,183
అసలేం జరుగుతుంది?

388
00:37:06,266 --> 00:37:07,851
నువ్వు నిలిపివేసిన ఖాతా ఉంది కదా?

389
00:37:07,935 --> 00:37:10,479
ఎస్ ఏ డి మరియు యెమెన్ పి ఎస్ ఓ
ఎవరినో పట్టుకున్నారు.

390
00:37:10,562 --> 00:37:13,440
-సులేమాన్ నా?
-లేదు ఇద్దరు కొరియర్లు అనుకుంటున్నారు.

391
00:37:13,523 --> 00:37:16,026
మీరు ఎస్ఏడి అన్నారు,
నేనే పర్యవేక్షణ ఆదేశించలేదు.

392
00:37:16,151 --> 00:37:18,820
-నేను ఆదేశించాను.
-నేనింకా అంతవరకు రాలేదన్నారు కదా?

393
00:37:18,904 --> 00:37:21,281
నువ్వు రాలేదు. కానీ దానర్థం
నువ్వన్నది తప్పని కాదు.

394
00:37:21,365 --> 00:37:23,700
మరి నన్ను మీ గదిలోంచి తరిమేసే బదులు
ఆ విషయం చెప్పి ఉండవచ్చు కదా?

395
00:37:23,784 --> 00:37:26,620
ఎందుకంటే నువ్వు నాకు తెలీదు. పైగా
నీకు సమాధానాలివ్వాల్సిన అవసరం లేదు.

396
00:37:27,496 --> 00:37:30,540
ఇప్పుడు ఎస్ ఏ డి, యెమెన్ వాళ్ళు
విచారణ చేయబోతున్నారు,

397
00:37:30,624 --> 00:37:32,668
కానీ ఆ ఆర్థిక చెత్త అంతా
తెలిసింది నీకే కదా.

398
00:37:32,751 --> 00:37:35,504
అందుకని నువ్వక్కడ ఉంటే
వాళ్ళకి ఏం ప్రశ్నలడగాలో తెలుస్తుంది.

399
00:37:36,338 --> 00:37:39,466
ఏంటి? లేదు. నేను యెమెన్ కి రాను.

400
00:37:39,549 --> 00:37:40,676
ఎందుకు రావు?

401
00:37:41,176 --> 00:37:42,719
నేను ఒక విశ్లేషకుడిని.

402
00:37:42,803 --> 00:37:45,097
నేను విచారణలు చేయను.
నేను నివేదికలు వ్రాస్తాను.

403
00:37:46,807 --> 00:37:48,433
సరే ఇది అసాధారణ సందర్భం.

404
00:37:50,477 --> 00:37:52,437
విమానం ఎక్కు.

405
00:38:09,079 --> 00:38:12,958
బ్లాక్ సైట్: "కోబాల్్ట"
సరావత్ కొండలు, యెమెన్

406
00:38:36,398 --> 00:38:38,025
మమ్మల్ని తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.

407
00:38:44,656 --> 00:38:46,867
జిమ్! కలిసినందుకు సంతోషం, సోదరా!

408
00:38:46,950 --> 00:38:48,368
మాటిస్, ఇతను డా. రైన్.

409
00:38:48,452 --> 00:38:49,786
-మాటిస్.
-ఎలా ఉన్నారు?

410
00:38:49,870 --> 00:38:52,247
-మీరు ఎందులో డాక్టర్?
-అర్థశాస్త్రంలో.

411
00:38:54,541 --> 00:38:55,709
బాగుంది.

412
00:38:57,627 --> 00:39:00,088
నువ్వు పాకిస్థాన్ లో ఉన్నావనుకున్నాను.

413
00:39:00,172 --> 00:39:03,175
-లేదు లాంగ్లీకి వెనక్కి వెళ్ళాను.
-ప్రధాన కార్యాలయానికా?

414
00:39:03,258 --> 00:39:05,010
-అవును.
-వినడానికి బాధగా ఉంది.

415
00:39:05,844 --> 00:39:08,513
మీ సంగతేంటి? మీ కథ ఏంటి డాక్టర్?

416
00:39:08,597 --> 00:39:11,266
-నేను విశ్లేషకుడిని.
-నిజంగానా.

417
00:39:11,349 --> 00:39:13,018
ఏం విశ్లేషిస్తారు?

418
00:39:13,393 --> 00:39:17,481
ప్రపంచ మార్కెట్లు, చాలావరకు.
ఆర్థిక అసాధారణతలు, అలాంటివి.

419
00:39:18,231 --> 00:39:19,900
ఏవైనా టిప్్స ఉన్నాయా?

420
00:39:20,734 --> 00:39:23,320
-టిప్సా?
-అదే స్టాక్ గురించి.

421
00:39:23,820 --> 00:39:25,655
నా పోర్ట్ ఫోలియో విస్తరించాలని
అనుకుంటున్నాను.

422
00:39:28,950 --> 00:39:32,329
ఇతను కెప్టెన్ అహ్మద్.
విచారణ చేసేది ఇతనే.

423
00:39:32,412 --> 00:39:33,663
స్వాగతం.

424
00:39:42,130 --> 00:39:44,174
అతను నీళ్ళు అడిగాడు,
మేము ఏమీ ఇవ్వలేదు.

425
00:39:44,257 --> 00:39:45,175
మంచిది.

426
00:39:54,810 --> 00:39:58,939
హే ఆర్చీ, నీ నియమాలు ప్రక్కన పెట్టు.

427
00:40:03,068 --> 00:40:04,152
తలుపు తెరువు.

428
00:40:08,698 --> 00:40:09,908
మేము వచ్చాము.

429
00:40:28,510 --> 00:40:30,679
టోబీ కీత్ పాటలు నచ్చాయా?

430
00:40:32,764 --> 00:40:35,851
నాకు జార్్జ స్ట్రైట్ పాటలు
ఎక్కువ ఇష్టం.

431
00:40:37,144 --> 00:40:38,728
"అమారిల్లో బై మార్నింగ్"

432
00:40:38,812 --> 00:40:40,605
"ఆల్ మై ఎక్సెస్ లివ్ ఇన్ టెక్సాస్"

433
00:40:41,565 --> 00:40:43,525
కానీ ఎవరి ఇష్టం వాళ్ళది.

434
00:40:44,276 --> 00:40:47,112
ఇదిగో ఇతను మీ నాయకుడు.

435
00:40:48,071 --> 00:40:49,531
ఒమర్ రబిని.

436
00:40:50,490 --> 00:40:51,408
సౌదీ.

437
00:40:54,244 --> 00:40:55,287
అంగరక్షకుడు.

438
00:40:56,454 --> 00:40:59,291
యెమెని డ్రైవర్ లైసెన్్స.
సౌఫన్ తరువాత పేరు ఏదో ఉంది.

439
00:40:59,374 --> 00:41:01,168
ఏడెన్లో సౌదీకి పనేంటి?

440
00:41:02,252 --> 00:41:04,254
వ్యాపారం కొరకు వచ్చానని అన్నాడు.

441
00:41:05,755 --> 00:41:07,424
అతని పెట్టెలో ఇది దొరికింది.

442
00:41:08,008 --> 00:41:11,261
అందులో ఉన్న నంబరుకు కాల్ చేసాము,
ఆన్సరింగ్ సర్వీస్ వచ్చింది.

443
00:41:11,803 --> 00:41:13,597
అదంతా ఉత్తదే అయ్యి ఉండవచ్చు.

444
00:41:13,680 --> 00:41:15,182
వీళ్ళల్లో ఒకరికి ఫోన్
ఉందని అన్నారు కదా?

445
00:41:32,741 --> 00:41:34,284
ఎవరికైనా ఫాంటా కావాలా?

446
00:41:48,340 --> 00:41:50,508
ఇది లావాదేవీల నంబరే.

447
00:41:54,930 --> 00:41:57,933
ఆహా, మనకో విజేత దొరికినట్టున్నాడు.

448
00:41:59,434 --> 00:42:01,937
ఇతన్ని పెద్ద గదికి తీసుకువెళ్ళండి.

449
00:42:07,234 --> 00:42:08,985
ఇతన్ని పెద్ద గదికి తీసుకెళ్ళండి.

450
00:42:11,029 --> 00:42:13,573
లేచి నిలబడు. పద. నడువు.

451
00:42:29,547 --> 00:42:32,926
నిజం చెప్పే వరకు ఎక్కడికీ వెళ్ళలేవు!

452
00:42:34,386 --> 00:42:35,303
నాకేమీ తెలీదు.

453
00:42:37,264 --> 00:42:39,474
ఆ డబ్బులు ఎవరికి పంపించావు?

454
00:42:45,021 --> 00:42:45,981
ఎక్కడికి వెళ్తున్నావు?

455
00:42:46,064 --> 00:42:49,276
వాళ్ళు ఇది మొదలుపెట్టి కొన్ని
గంటలయ్యింది. నాకు గాలి కావాలి.

456
00:43:15,302 --> 00:43:16,678
మీకేమైనా కావాలా, సర్?

457
00:43:17,762 --> 00:43:19,431
ఏదైనా తినడానికి కావాలి.
ఎక్కడ దొరుకుతుంది?

458
00:43:47,667 --> 00:43:49,794
నాకు వీళ్ళు తెలుసు. ఇక్కడే ఉండు.

459
00:44:03,641 --> 00:44:05,852
ఇంకో నలుగురిని తెచ్చాము, మిత్రమా.

460
00:44:05,935 --> 00:44:08,021
డ్రోన్ దాడిలో చనిపోయారు.

461
00:44:27,832 --> 00:44:29,709
మీ జాబితా అయిపోయింది.

462
00:44:29,793 --> 00:44:31,002
మనకొక ఒప్పందం ఉంది కదా?

463
00:44:32,212 --> 00:44:35,465
సరే, సమర్పిస్తున్నాము,
మీలో ఎవరు కోటీశ్వరులు.

464
00:45:07,205 --> 00:45:09,082
ధన్యవాదాలు, కార్పొరల్. అంతే.

465
00:45:19,175 --> 00:45:20,343
తిను.

466
00:45:23,513 --> 00:45:24,556
అది విషం కాదు.

467
00:46:01,384 --> 00:46:04,012
-దేవుడు నీతో ఉండుగాక, మిత్రమా.
-సరే, అలాగే.

468
00:46:06,890 --> 00:46:09,767
డాక్టర్ వాళ్ళని గుర్తించే వరకు,
ఈ శవాలను కూలర్ లో పెట్టండి.

469
00:46:16,858 --> 00:46:19,736
ఇంతకు ముందు, నేను డబ్బు లావాదేవీల
గురించి మాట్లాడగానే, నన్ను చూసావు.

470
00:46:21,446 --> 00:46:23,031
నీకు అర్థమయ్యింది.

471
00:46:24,073 --> 00:46:26,117
ఇప్పుడు అర్థం చేసుకున్నావు
అనుకుంటున్నాను.

472
00:46:30,079 --> 00:46:33,416
సౌఫన్, ఇది లెబనీస్ పేరు కదా?

473
00:46:39,255 --> 00:46:41,049
నువ్వు ఎప్పుడూ ఈ పనులే చేస్తుంటావా?

474
00:46:42,717 --> 00:46:45,845
వీధుల్లోంచి అమాయకులను ఎత్తుకొచ్చి,
వాళ్ళని విచారించడం?

475
00:46:47,430 --> 00:46:49,474
నిజానికి, నువ్వు నా మొదటివాడివి.

476
00:46:51,267 --> 00:46:52,310
ఎలా చేస్తున్నాను?

477
00:46:56,731 --> 00:46:58,107
నేను విశ్లేషకుడిని.

478
00:46:59,359 --> 00:47:00,985
అంటే అర్థం ఏమిటి?

479
00:47:01,110 --> 00:47:03,154
అంటే, నేను బల్ల వెనక
కూర్చుని పని చేస్తాను.

480
00:47:07,200 --> 00:47:09,202
నీ సంగతేంటి, సౌఫన్? నువ్వేం చేస్తావు?

481
00:47:10,912 --> 00:47:11,913
నేను అంగరక్షకుడిని.

482
00:47:18,336 --> 00:47:20,505
చేతుల పైన ఆ మచ్చలు ఏంటి?

483
00:47:21,923 --> 00:47:24,259
అది పాత గాయం. నా చిన్నతనంలోది.

484
00:47:25,343 --> 00:47:26,636
లెబనాన్ లోనా?

485
00:47:33,643 --> 00:47:35,478
గాలి వాటాన్ని అనుసరిస్తూ
ముందుకు వెళ్ళండి.

486
00:49:13,326 --> 00:49:16,788
ఇంకొకతను, అదే రబిని,

487
00:49:18,414 --> 00:49:19,499
అతను నీకెలా పరిచయం?

488
00:49:21,709 --> 00:49:23,086
అతను నా క్లయింట్.

489
00:49:27,840 --> 00:49:29,967
-అతనికి ఎక్కువగా పని చేస్తావా?
-ఇదే మొదటిసారి.

490
00:49:30,593 --> 00:49:31,969
అతని గురించి నీకు ఏం తెలుసు?

491
00:49:33,137 --> 00:49:36,057
సాధారణంగా, నా క్లయింట్లతో
నేను ఎక్కువగా మాట్లాడను.

492
00:49:36,849 --> 00:49:38,017
కానీ వింటావు కదా.

493
00:49:42,271 --> 00:49:43,189
సౌఫన్,

494
00:49:46,109 --> 00:49:48,945
"సులేమాన్" అనే పేరు విన్నావా?

495
00:49:54,242 --> 00:49:55,952
అది ఇక్కడ చాలా సాధారణమైన పేరు.

496
00:49:56,411 --> 00:49:58,579
నువ్వింకా నిర్దిష్టంగా చెప్పాలి.

497
00:50:10,091 --> 00:50:11,384
ఇప్పుడేంటి?

498
00:50:17,890 --> 00:50:19,809
ఆ ఇరవై రూపాయల గాడు ఇంకా
డబ్బులు కావాలని అంటున్నాడు.

499
00:50:33,698 --> 00:50:35,032
అరే!

500
00:51:51,234 --> 00:51:52,944
వెనకాల గదిలో, తలుపు వెనక.

501
00:51:54,570 --> 00:51:57,240
వాళ్ళు గోడలో ఉన్నారు. కదలండి!

502
00:52:07,834 --> 00:52:09,168
అతన్ని అక్కడి నుండి తీసుకురండి!

503
00:52:25,226 --> 00:52:26,602
చుట్టూ విస్తరించండి.

504
00:52:55,882 --> 00:52:57,133
లోపలికి వస్తున్నారు!

505
00:53:03,931 --> 00:53:06,309
జెనరేటర్ దగ్గరికి వెళ్ళారు, వెధవలు!

506
00:53:14,775 --> 00:53:15,943
గేట్ కు తాళం వేయండి!

507
00:53:16,527 --> 00:53:18,779
ముందు గేటును సంరక్షించాలి!

508
00:53:19,071 --> 00:53:21,866
మీరిద్దరూ, నాతో రండి! పదండి. వెళ్దాం!

509
00:53:37,340 --> 00:53:38,466
పడెయ్యి.

510
00:53:40,051 --> 00:53:42,136
పడెయ్యమని చెప్పాను.

511
00:53:52,313 --> 00:53:55,066
అతనెక్కడ ఉన్నాడు? అతనెక్కడ ఉన్నాడు?

512
00:53:56,067 --> 00:53:57,360
పద.

513
00:54:24,553 --> 00:54:27,181
ఇప్పుడు ఇంకొకడు.

514
00:54:39,610 --> 00:54:40,695
మనకు కవచం కావాలి!

515
00:54:42,655 --> 00:54:44,949
-ఎపిసికి వెళ్దాం.
-అవును!

516
00:55:16,731 --> 00:55:17,982
తలుపు వెనకాల చూసుకో!

517
00:55:18,065 --> 00:55:18,941
పరిగెత్తండి!

518
00:55:58,731 --> 00:55:59,565
లే!

519
00:56:45,903 --> 00:56:49,532
నన్ను కాలిస్తే, ఇది పడేస్తాను,
అందరం చస్తాం.

520
00:56:53,160 --> 00:56:54,286
అబధ్ధం చెప్తున్నాడు.

521
00:56:57,832 --> 00:56:58,999
లేదు. అబధ్ధం చెప్పట్లేదు.

522
00:57:01,919 --> 00:57:03,462
కాల్చకు.

523
00:57:03,546 --> 00:57:05,131
సైనికుడి నుండి తాళం చెవులు తీసుకో.

524
00:57:30,990 --> 00:57:32,700
తలుపు వైపుకి కదులు.

525
00:57:37,580 --> 00:57:38,747
విశ్లేషకుడివి అనుకున్నాను.

526
00:57:39,790 --> 00:57:41,417
అంగరక్షకుడివి అనుకున్నాను.

527
00:57:46,297 --> 00:57:47,298
అది నువ్వే.

528
00:57:52,261 --> 00:57:53,387
సులేమాన్.

529
01:01:09,416 --> 01:01:10,918
మూసా!

530
01:01:13,003 --> 01:01:14,338
మూసా!

